spot_img
Homeఎంటర్టైన్మెంట్Jagapathi Babu : సిగ్గు లేకుండా అడుగుతున్నా.. ఏం తాగాలో చెప్పండి

Jagapathi Babu : సిగ్గు లేకుండా అడుగుతున్నా.. ఏం తాగాలో చెప్పండి

Jagapathi Babu : సినీ నటులకు టన్నుల కొద్దీ హిప్పోక్రసి ఉంటుంది అంటారు. అయితే ఆ కేటగిరీలో జగపతిబాబుని చేర్చలేం. ప్రతి నాయకుడిగా నటించాడు. హీరోగా మెప్పించాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కరుడుగట్టిన విలన్ గా నటిస్తున్నాడు. కూతురి ఇష్టాన్ని కాదనలేక ఓ విదేశీ యువకుడితో పెళ్లి చేసిన తండ్రిగా, సంపాదించిన డబ్బును జూదంలో పోగొట్టుకున్న వ్యసనపరుడిగా.. ఇలా చాలా కోణాలు ఉన్నాయి జగపతిబాబులో.. అందుకే ఆయనంటే చాలామంది ఇష్టపడుతుంటారు. ఆయనలా బతకాలి అని కోరుకుంటారు. 90 ల కాలంలో అల్ టైమ్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన జగపతిబాబు.. ఆ తర్వాత కొన్నాళ్లకు ఫెడ్ ఔట్ అయ్యారు. లెజెండ్ సినిమా ద్వారా విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వెను తిరిగి చూసుకోలేదు.

సినీ నటుడు అయినప్పటికీ రియాల్టీలో నటించే జగపతిబాబు ఏ విషయానైనా సరే కుండబద్దలు కొట్టేస్తుంటారు. సంపాదించిన డబ్బును తీసుకెళ్లలేమని.. అందుకే తనకు ఇష్టమైన జూదంలో ఖర్చు పెడతానని జగపతిబాబు అంటాడు. జీవితాన్ని ఎప్పుడూ కూడా సీరియస్ గా జీవించొద్దని.. ప్రతిక్షణాన్ని ఆస్వాదించాలని జగపతిబాబు చెబుతుంటాడు. అందుకే ఆయనకు సర్కిల్ చాలా ఎక్కువ. సినీ నటులు మాత్రమే కాకుండా బయటి వ్యాపారవేత్తలతో జగపతిబాబుకు సత్సంబంధాలున్నాయి. సినిమా అయిపోగానే వెంటనే ఇంటికి వెళ్లే జగపతిబాబు.. కుటుంబంతో సరదాగా గడుపుతుంటాడు. పని ఒత్తిడి ఎక్కువైందనిపిస్తే విదేశాలకు వెళ్ళిపోతాడు. తనకు నచ్చిన ప్రదేశంలో తిరుగుతుంటాడు. తాను మెచ్చిన ప్రదేశంలో తింటూ ఉంటాడు. అక్కడ తాను ఎంజాయ్ చేసిన దృశ్యాలను సోషల్ మీడియాలో పంచుకుంటాడు. తాజాగా జగపతిబాబు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు.. అది నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.

ఒక విశాలమైన గదిలో జగపతిబాబు ఒక టేబుల్ పై అలా ఒంగి నిలుచున్నాడు. ఒక చేతిలో పాలడబ్బా, మరో చేతిలో మద్యం సీసా పట్టుకొని..”ఎలాగోలా పుట్టే శాను. సిగ్గు లేకుండా అడుగుతున్నాను. ఇందులో ఏది ముందు తాగాలో మీరు డిసైడ్ చేసి చెప్పండి” అంటూ తనను అనుసరిస్తున్న నెటిజన్లను అడిగాడు. ఈ పోస్టుకు చాలామంది స్పందించారు. ” సార్ ఇవాళ నా పుట్టినరోజు. పాలడబ్బా ఎందుకు గాని.. మందు తాగి చిల్ అవ్వండి. నాకు విషెస్ చెప్పండి” అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. “జగ్గూ భాయ్.. మీరు సినీనటుడు అయినప్పటికీ ఎటువంటి భయం లేకుండా ప్రేక్షకులను ఇలా అడుగుతున్నారంటే మీరు మామూలు మనిషి కాదు” అని మరో నెటిజన్ పేర్కొన్నాడు. కాగా సోషల్ మీడియాలో జగపతిబాబు పోస్ట్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సర్క్యులేట్ అవుతోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Thammineni Seetharam Case: తమ్మినేని సూత్రధారి.. కోర్టులో సంచలనం!

Thammineni Seetharam Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన అధికార దర్పాన్ని ఉపయోగించి.. నకిలీ పత్రాలతో కుమారుడి పేరుతో నాలుగు కోట్ల రూపాయల విలువైన...

Chennai Love Story Movie: చెన్నై లవ్ స్టోరీ మూవీ ని రిజెక్ట్ చేసి బాధపడుతున్న స్టార్ హీరో…

Chennai Love Story Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఇలాంటి...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాను రామ్ చరణ్ చేశాడుగా…

Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు పవన్ కళ్యాణ్... 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో హీరోగా మారిన ఆయన ఆ తర్వాత చేసిన 'గోకులంలో సీత'...

YSRCP: మారిన గిరిజనుల మనసు.. వైసీపీకి డేంజర్ బెల్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.....

Perni Nani: పేర్ని వారి నకిలీ పట్టాలు.. ఈ కథ మామూలుగా లేదు

Perni Nani: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వైఖరి వెలుగు చూస్తోంది. చాలామంది నేతలకు పోలీస్ కేసులు చుట్టుముడుతున్నాయి. అయితే అవన్నీ తమ వారసుల ద్వారా.. వారసుల కోసం చేసే...
Oktelugu Epaper
Exit mobile version