Homeఎంటర్టైన్మెంట్Anil Ravipudi: మార్కెట్ పూర్తిగా కోల్పోయిన హీరోతో సినిమాని ప్రకటించిన అనిల్ రావిపూడి.. ఇదేమి ధైర్యం...

Anil Ravipudi: మార్కెట్ పూర్తిగా కోల్పోయిన హీరోతో సినిమాని ప్రకటించిన అనిల్ రావిపూడి.. ఇదేమి ధైర్యం బాబోయ్..

Anil Ravipudi: ప్రస్తుతం అనిల్ రావిపూడి కి టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘పటాస్’ సినిమాతో మొదలైన ఆయన జర్నీ , ‘మన శంకర వరప్రసాద్ గారు’ వరకు వరుస బ్లాక్ బస్టర్స్ తో సాగింది. వరుసగా రెండు సార్లు 300 కోట్ల గ్రాస్ సినిమాలను అందుకొని చరిత్ర తిరగరాసిన అనిల్ రావిపూడి, ప్రేస్తుతం వెంకటేష్ – కళ్యాణ్ రామ్ లతో ఒక మల్టీస్టార్రర్ చిత్రం చేస్తున్నారు. రీసెంట్ గానే రెగ్యులర్ షూటింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఇదంతా పక్కన పెడితే , అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని అక్కినేని నాగార్జున తోనో , లేదంటే మెగాస్టార్ చిరంజీవి తోనో చేస్తారని అంతా అనుకుంటే , సీనియర్ హీరో జగపతి బాబు తో ఒక సినిమాని ప్రకటించి అందరినీ షాక్ కి గురి చేశారు.

హీరో పాత్రలకు గుడ్ బై చెప్పి , క్యారెక్టర్ రోల్స్, విలన్ రోల్స్ తో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న జగపతి బాబు , చాలా రోజుల తర్వాత హీరో గా నటించిన చిత్రం ‘వదలా’. నేడు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఎప్పుడో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా, బిజినెస్ జరగకపోవడం వల్ల విడుదల ఆగిపోయింది. దీంతో మేకర్స్ ఈ చిత్రాన్ని సొంతంగా నేడు విడుదల చేశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో జగపతి బాబు మాట్లాడుతూ, అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఒక కామెడీ సినిమా చెయ్యాలి అనే కోరికని బయటపెట్టాడు. అనంతరం అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘జగపతి బాబు గారు కోరినట్టుగానే , త్వరలోనే మా కాంబినేషన్ లో హీలేరియన్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా ఉంటుంది’ అని ప్రకటించారు.

ఒకప్పుడు జగపతి బాబు మంచి మార్కెట్ ఉన్న హీరోనే. ఆయన సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ క్యూలు కట్టేవారు. మహిళల్లో విపరీతమైన క్రేజ్ ఉండేది, అందరూ ఆయన్ని శోభన్ బాబు తో పోల్చేవారు. కానీ ఆయన హీరో గా ఫేడ్ అవుట్ అయిపోయి చాలా కాలం అయ్యింది. జనాలు ఇప్పుడు జగపతి బాబు ని క్యారెక్టర్ ఆర్టిస్టుగా , విలన్ గా చూస్తూ అలవాటు పడ్డారు. ఇప్పుడు ఆయన హీరో గా నటిస్తే థియేటర్స్ కి వచ్చే రోజులు పోయాయి. అలాంటి మార్కెట్ లేని హీరో తో , వందల కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టే డైరెక్టర్ సినిమా చేస్తానని అనడం నిజంగా ఆశ్చర్యానికి గురి చేసే విషయమే. మరి ఈ సినిమా ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version