
Actress Shobha Shetty: పెళ్లంటే నూరేళ్ల పంట. ఈ నూరేళ్లు కలకాలం కలిసుండేందుకు పెళ్లి క్రతును ఘనంగా నిర్వహించుకుంటారు. ఈ పెళ్లిలో చుట్టాలు, స్నేహితులు వచ్చి సందడి చేస్తుంటారు. వధూ, వరులపై స్నేహితులు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. కొందరు పెళ్లి మండపం ఎక్కి మరి ఆ ఇద్దరినీ ఆటపట్టిస్తుంటారు. లేటేస్టుగా పెళ్లికి సంబంధించిన ఓ వీడియ సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తోంది. ఒకమ్మాయి పెళ్లి రిషెప్షన్ వద్దకు వెళ్లి పెళ్లి ఆపాలంటూ రచ్చ చేసింది. తననుపెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావ్? అని అడగడంతో అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. ఒక్కసారిగా పెళ్లి ఆగిపోతుందా? అన్నఆందోళన వ్యక్తం చేశారు. కానీ జరగిందేంటంటే?
ఎంతో సంతోషంగా ఓ జంట పెళ్లి చేసుకుంది. అందుకు సంబంధించిన రిసెప్షన్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా అతిథులంతా రిసెప్షన్ స్టేజీపైకి వచ్చిన నూతన జంటను ఆశీర్వదిస్తున్నారు. కొందరు బహుమతులు ఇచ్చి ఇంప్రెస్ చేస్తున్నారు. బంధువులంతా వచ్చి వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సమయంలో ఒక అందమైన అమ్మాయి బ్లాక్ మాస్క్ పెట్టుకొని స్టేజి ఎక్కింది. అందరిలాగే ఈమె కూడా నూతన జంటను ఆశీర్వదిస్తుందని అనుకున్నారు. కానీ ఆమె చెప్పొన ఒకే ఒక్క డైలాగ్ అక్కడున్నవారిని ఆశ్చర్యపరిచేలా చేసింది.
ఈమె సరాసరి పెళ్లికొడుకు వద్దకు వెళ్లి ‘నా ఫోన్ ఎందుకు ఎత్తట్లేవ్’? అని ప్రశ్నించింది. ‘నన్ను రమ్మంటావ్.. మళ్లీ నా ఫోన్ ఎత్తవా?’ అని అడుగుతుంది. దీంతో పక్కనున్న ఓ వ్యక్తి షాక్ తింటాడు. అంతలోనే పెళ్లికొడుకు తల్లి అక్కడికి వచ్చి ఏం జరిగింది? అని అందోళన చెందుతుంది. దీంతో ఆ అమ్మాయి ‘నన్ను లవ్ చేసి ఈ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావ్’? అని గట్టిగా ప్రశ్నిస్తుంది. అమ్మాయి మాస్క్ పెట్టుకోవడం వల్ల ఎవరూ గుర్తించలేకపోయారు.

కానీ పెళ్లికొడుకుకు ఇది ఫ్రాంక్ వీడియో అని అర్థమైనట్లుంది. అందుకే ఆయన నవ్వుతూ ‘నా ఫోన్ ఎక్కడో పెట్టి మరిపోయా..’ అంటూ రిప్లై ఇచ్చాడు. కాసేపటి తరువాత ‘నన్ను పెళ్లి చేసుకో..’ అంటూ గట్టిగా అరిచింది. అయితే పరిస్థితి తేడా కొట్టేసరికి వెంటనే ‘ఒకే.. ఒకే..’ అంటూ ఆమె మాస్క్ తీసేసింది. వెంటనే నవ్వుతూ ‘ఇది ఫ్రాంక్..’ అంటూ చెప్పడంతో అక్కడున్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఆ తరువాత ఆమె నూతన జంటను ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆమె చేసిన ఫ్రాంక్ పెళ్లికొడుకుకు ముందే తెలిసిపోయింది. కానీ మిగతా వారు మాత్రం షాక్ కు గురయ్యారు.ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదు..కన్నడ నటి శోభాశెట్టి.. ఈ వీడియోను మీరు కూడా చూడండి..