Rashmika Mandanna: ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ కాలం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి రష్మిక..కన్నడ లో ‘కాంతారా’ మూవీ హీరో /డైరెక్టర్ రిషబ్ శెట్టి దర్శకత్వం లో వచ్చిన కిరిక్ పార్టీ అనే సినిమా ద్వారా వెండితెరకి పరిచయమైనా రష్మిక ఆ తర్వాత తెలుగులో నాగశౌర్య హీరో గా నటించిన ‘ఛలో’ అనే సూపర్ హిట్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది..ఆ సినిమా తర్వాత ఆమె చేసిన ‘గీత గోవిందం’ చిత్రం పెద్ద సెన్సేషనల్ హిట్..ఈ చిత్రం ద్వారానే ఆమె స్టార్ హీరోయిన్ గా అవతరించింది.

ఇక ఆ తర్వాత ఈమె తెలుగు , హిందీ , తమిళం, కన్నడ అని తేడా లేకుండా ప్రతీ ఇండస్ట్రీ లో స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది..అలా చూస్తుండగానే పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయింది రష్మిక..ఇక గత ఏడాది ఆమె హీరోయిన్ గా నటించిన పుష్ప చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో ఎంతతి సెన్సేషన్ సృష్టించిందో అందరికి తెలిసిందే.
ఆ సినిమా తర్వాత ఈమెకి బాలీవుడ్ లో ఆఫర్ల వెల్లువ కురుస్తుంది..సందీప్ వంగ – రణబీర్ కపూర్ కాంబినేషన్ లో వస్తున్న ‘ఎనిమల్’ చిత్రం లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసిన రష్మిక ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ తో కలిసి ‘గుడ్ బై’ అనే చిత్రం లో నటించింది..ఇప్పుడు లేటెస్ట్ గా ఈమె సిద్దార్థ్ మల్హోత్రా తో కలిసి నటించిన ‘మిషన్ మజ్ను’ చిత్రం నేరుగా ఓటీటీ లో విడుదల కాబోతుంది..లవ్ మరియు సైన్స్ ఫిక్షన్ నేపథ్యం లో తెరకెక్కించిన ఈ మూవీ లో రష్మిక అంధురాలిగా నటిస్తుంది.

కంటి చూపు కోల్పోయిన అమ్మాయిగా ఆమె పాత్ర చుట్టూనే ఈ సినిమా నడుస్తుందట..చాలా ఛాలెంజింగ్ గా తీసుకొని ఈ చిత్రం లో ఆమె నటించినట్టు తెలుస్తుంది..ఇక సినిమా తో పాటుగా ఆమె తమిళం లో దళపతి విజయ్ తో కలిసి ‘వారిసు’ అనే చిత్రం లో నటించింది..తెలుగు లో ఈ చిత్రం వారసుడు అనే పేరుతో జనవరి 12 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవుతుంది.