Rambha Car Accident: ఒకప్పటి హాట్ హీరోయిన్ రంభ. ఈమె చిరంజీవి సహా టాలీవుడ్ అగ్రహీరోలతో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అప్పట్లో అసలు సిసలు ముద్దుగుమ్మలా టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచేసింది. సినిమాల్లో హీరోయిన్ కెరీర్ ముగిశాక ప్రవాస భారతీయుడిని వివాహం చేసుకొని కెనడాలో జీవిస్తోంది. తన భార్త, పిల్లలను చూసుకుంటూ హౌస్ వైఫ్ లా కాలం గడుపుతోంది. అయితే తాజాగా రంభకు ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది.
కెనడాలోని టొరంటోలో స్కూలు నుంచి పిల్లలను తీసుకొస్తుండగా రంభ నడుపుతున్న కారును మరో కారు వచ్చి వేగంగా ఢీకొట్టింది. అకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదంతో తన ఫ్యామిలీ అందరికీ గాయాలయ్యాయని రంభ వాపోయింది. ఈ ప్రమాదంలో రంభతోపాటు ఆమె కూతురు సాషాకు గాయాలయ్యాయని తెలిసింది. సాసా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది.
ఈ మేరకు రంభ సోషల్ మీడియాలో ప్రమాదంపై పోస్ట్ చేసింది. స్కూలు నుంచి పిల్లలను పికప్ చేసుకొని వస్తుండగా ఇంకో కారు అనుకోకుండా తమ కారును ఢీకొట్టిందని.. ఈ ప్రమాదంలో అందరికీ చిన్న చిన్న గాయాలయ్యాయని తెలిపింది. నా కూతురు సాషా మాత్రం ఇంకా హాస్పిటల్ లోనే ఉందని వివరించింది.
‘తను త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థించండి.. మాకు ఈ రోజు టైం బ్యాడ్ డేస్.. ఈ సమయంలో మీ ప్రార్థనలు మాకెంతో ముఖ్యమైనవి’ అంటూ రంభ సోషల్ మీడియాలో కోరింది. దీంతో అందరూ రంభ ఫ్యామిలీ సభ్యులు కోలుకోవాలని సోషల్ మీడియాలో మెసేజ్ లు, కామెంట్స్ చేస్తున్నారు.