
Krithi Shetty: ఇటీవల కాలం లో వచ్చిన కొంతమంది కొత్త హీరోయిన్స్ లో కేవలం మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న వారిలో ఒకరు కృతి శెట్టి.’ఉప్పెన’ సినిమాతో ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన కృతి శెట్టి కి యూత్ లో క్రేజ్ మామూలు రేంజ్ లేదు.ముఖ్యంగా బయట తిరిగే ఆటోలు మరియు బస్సులపై ఈమె ఫోటో ఉండడం చాలా కామన్ అయిపోయింది.
కానీ ఎంత క్రేజ్ ఉన్నా కూడా సరైన స్క్రిప్ట్స్ ఎంచుకోకపోతే డిజాస్టర్ ఫ్లాప్స్ వస్తాయి.అందువల్ల కెరీర్ పోతుంది, కృతి శెట్టి విషయం లో కూడా జరుగుతున్నది అదే.ఉప్పెన సినిమా తర్వాత ఈమె చేసిన ‘శ్యామ్ సింగ రాయ్’ మరియు ‘బంగార్రాజు’ వంటి సూపర్ హిట్స్ తగిలాయి కానీ, ఆ సినిమాల తర్వాత ఈమె చేసిన చిత్రాలన్నీ ఒకదానిని మించి ఒకటి డిజాస్టర్ ఫ్లాప్ అవుతూ వచ్చాయి.
అదే సమయం లో టాలీవుడ్ లోకి శ్రీలీల అనే కొత్త హీరోయిన్ దూసుకు రావడం, నిర్మాతలకు ఇప్పుడు ఈమెనే మొట్టమొదటి ఛాయస్ అవ్వడం తో, కృతి శెట్టి ని పట్టించుకోవడం మానేశారు.ప్రస్తుతం ఈమె ఆశలన్నీ నాగ చైతన్య తో చేసిన ‘కస్టడీ’ అనే చిత్రం పైనే ఉన్నాయి.తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా పై ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.ఈ సినిమా తర్వాత ఆమె బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది.ఒక ప్రముఖ స్టార్ హీరో సినిమాలో ఈమెకి సెకండ్ హీరోయిన్ రోల్ చేసే అవకాశం దక్కింది.

ఒకప్పుడు శ్యామ్ సింగ రాయ్ సినిమాని హిందీ లో రీమేక్ చెయ్యాలనే ఆలోచనతో బాలీవుడ్ మేకర్ కృతి శెట్టి ని కలవగా ఆమె నటించడానికి ఒప్పుకోలేదని, తెలుగు సినిమా మీదనే తన పూర్తి ఫోకస్ అని, ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.అలాంటిది ఇప్పుడు బాలీవుడ్ లో ఏకంగా సెకండ్ హీరోయిన్ రోల్ చెయ్యడానికి అంగీకరించడం తో ఫ్యాన్స్ మండిపడుతున్నారు.అవకాశాలు తగ్గిపొయ్యేలోపు ఇచ్చిన మాటని కూడా తప్పుతావా అంటూ కృతి శెట్టి పై మండిపడుతున్నారు.