
Alcoholic Dog: అంత్యంత విశ్వతనీయ జంతువు ఏదైనా ఉంది అంటే అది కుక్క. ఓ ముద్ద అన్నం పెడితే జీవితాంతం వారిని మర్చిపోకుండా అంటిపెట్టుకుని తిరుగతాయి. పెంపుడు జంతువులను ప్రాణం చూసుకునే యజమానులు దూరమైతే అవి ఎంతగానో తల్లడిల్లిపోతాయి. యజమాని చనిపోయినా వారి కోసం ఎదురు చూసే కుక్కల గురించి విన్నాం. విశ్వాసానికి మారుపేరు అయిన ఓ కుక్క తన యజమాని మరణంతో అనారోగ్యంపాలైంది. దాని అనారోగ్యానికి కారణం యజమాని మరణం ఓ కారణమైతే మద్యానికి బానిస అవ్వటం మరొక కారణం..!
యజమానితోపాటు ఆలవాటు..
ఆ కుక్క యజమానికి మద్యం తాగటం అలవాటు.. తాను ఓ పెగ్ తాగి కుక్కకు కూడా పోసేవాడు. అలా ఇద్దరు కలిసి నిద్రపోయే ముందు మద్యం తాగటం అలవాటుగా మారింది. ఈక్రమంలో యజమాని చనిపోయాడు. ఆకుక్కకు మద్యం పోసేవారే లేకుండాపోయారు. అలా యజమాని మరణంతో మద్యానికి బానిసైన కుక్కకు మద్యం పోసేవారు లేక అనారోగ్యం పాలైంది. యజమాని లేడు.. మందుపోసే దిక్కులేకి ఆ పెంపుడు శునకం అనారోగ్యంపాలవ్వటం గమనించిన స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. దాన్ని పరీక్షించిన డాక్టర్లు దానికి వైద్యం చేశారు. అదిక్రమంగా కోలుకుంది. ఇలా మద్యానికి బానిసైన కుక్కకు వైద్యం చేయటం అది కోలుకోవటం ప్రపంచంలోనే మొట్టమొదటి కేసు.
బ్రిటన్‌లో వెలుగు చూసిందీ ఘటన..
బ్రిటన్‌లోని ప్లిమొత్ ప్రాంతంలో నివసించే ఓ వ్యక్తి తాగుడుకు బానిస. అతను లాబ్రడార్ జాతికి చెందిన కుక్కను పెంచుకుంటున్నాడు. దానికి కోకో అనే పేరు పెట్టుకున్నాడు. దానికి రెండేళ్లు. అతను తాను తాగటమే కాకుండా అతని పెంపుడు కుక్కకు కూడా మద్యం అలవాటు చేశాడు. అలా అతనితోపాటు కోకో కూడా మద్యానికి బాగా అలవాటు పడిపోయింది. టైమ్ అయితే చాలు ఇద్దరు కూర్చుని తాగటమే పనిగా ఉండేది. ఈక్రమంలో యజమాని మరణించాడు. యజమాని మరణించాక కోకోకు మద్యం పోసేవారులేకుండాపోయారు. దీంతో కోకా తీవ్ర అనారోగ్యం పాలైంది.

యానిమల్ రెస్క్యూ ట్రస్ట్‌కు..
కోకో అనారోగ్యాన్ని గుర్తించిన స్థానికులు యానిమల్ రెస్క్యూ ట్రస్ట్ కు అప్పగించారు. మద్యం తాగకపోవటంతో అనారోగ్యంపాలైన ఆ కుక్కకు తరచూ ఫిట్స్ వచ్చేవి. ఇంకా పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడేది. ఈ రోగ లక్షణాలను పరిశీలించిన డాక్టర్లు అది మద్యానికి బానిసైందని గుర్తించి చికిత్స ప్రారంభించారు. చికిత్సతో కోకో క్రమంగా కోలుకుంది.
ఓ కుక్క మద్యానికి బానిసై ఇలా కోలుకోవడం ప్రపంచంలో ఇదే తొలిసారి అని భావిస్తున్నారు దానికి వైద్యం చేసిన డాక్టర్లు.