Kiara Advani Marriage: హీరోయిన్ కియారా అద్వానీ పెళ్ళికి సిద్ధమయ్యారు. ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో ఏడడుగులు వేయనున్నారు. వీరి వివాహానికి వేదిక కూడా ఖరారైంది. ఇటీవల కియారాతో పెళ్లిపై సిద్ధార్థ్ స్పందించారు. ఆ విషయం మాకు కూడా తెలియదంటూ సెటైర్ వేశాడు. దీంతో పెళ్లి వార్తలకు బ్రేక్ పడింది. సడన్ గా మరో నాలుగు రోజుల్లో కియారా వివాహమన్న వార్తలు బాలీవుడ్ ని ఊపేస్తున్నాయి. సిద్ధార్థ్-కియారా వివాహానికి జైసల్మేర్ వేదిక కానుంది. రాజప్రసాదం లాంటి హోటల్ లో ఘనంగా జరగనుంది.

ఫిబ్రవరి 6న కియారా-సిద్ధార్థ్ ల వివాహం. దుబాయిలో 4, 5 తారీఖుల్లో సంగీత్, మెహందీ వేడుకలు నిర్వహిస్తారట. ఈ సెలెబ్రిటీ కపుల్ మ్యారేజ్ కి బాలీవుడ్ కి చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. కాగా కొన్నాళ్లుగా కియారాతో సిద్ధార్థ్ రిలేషన్ లో ఉన్నారు. షేర్షా మూవీలో వీరిద్దరూ కలిసి నటించారు. 2021లో ఈ చిత్రం విడుదలైంది. వీరి ఎఫైర్ పై వార్తలు వస్తున్నా ఏనాడూ స్పందించింది లేదు. అలాగే తమ రిలేషన్ పై స్పష్టత ఇవ్వలేదు. విశ్వసనీయ వర్గాలు మాత్రం వీరి ఎఫైర్ ధృవీకరించాయి. నటులుగా ఇద్దరూ బిజీగా ఉన్న టైంలో పెళ్లి పీటలు ఎక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటారు కదా మరి.
ఫైనల్ గా పెళ్లి బంధంతో ఈ జంట ఒక్కటవుతున్నారని సమాచారం అందుతుంది. కియారా తెలుగులో రెండు చిత్రాలు చేశారు. 2018లో మహేష్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భరత్ అనే నేను మూవీలో కియారా హీరోయిన్ గా చేశారు. అనంతరం రామ్ చరణ్ కి జంటగా వినయ విధేయ రామ చిత్రంలో నటించారు. ఈ రెండు చిత్రాలతో టాలీవుడ్ లో ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆర్సీ 15 మూవీలో మరోసారి రామ్ చరణ్ తో ఆమె జతకడుతున్నారు. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా చిత్రం చిత్రీకరణ జరుపుకుంటుంది. దిల్ రాజు నిర్మాతగా ఉన్నారు. ఆయన బ్యానర్ లో ఇది 50వ చిత్రం. దీంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ రెండు విభిన్నమైన పాత్రలు చేస్తున్నారు. ఆయన పీరియడ్ రోల్ కి సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యాయి. శంకర్ ఏక కాలంలో భారతీయుడు 2 షూట్ సైతం పూర్తి చేస్తున్నారు. దీంతో ఆర్సీ 15 కొంచెం ఆలస్యం అవుతుంది.