
Vishwak Sen- Devi Nagavalli: హీరో విశ్వక్ సేన్ కెరీర్లో చాలా వివాదాలున్నాయి. ప్రతి చిత్రానికి ఏదో ఒక గొడవ అవుతుంది. అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీ విడుదలకు ముందు విశ్వక్ సేన్ విమర్శలు ఎదుర్కొన్నాడు. చిత్ర ప్రమోషన్ కోసం రోడ్డు మీద ఓ ఫ్రాంక్ చేశాడు. దీని మీద జనాలు మండిపడ్డారు. పబ్లిక్ ని ఇబ్బంది పెడుతూ ఇలాంటి పనులేంటి? విశ్వక్ సేన్ కి బాధ్యత లేదా? అంటూ సోషల్ మీడియా వేదికగా ఏకిపారేశారు. ఈ వివాదం నేపథ్యంలో జర్నలిస్ట్ దేవి నాగవల్లి విశ్వక్ సేన్ ని స్టూడియోకి పిలిచి ఇంటర్వ్యూ చేయబోయారు.
ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతూనే ఇద్దరికీ చెడింది. అసలు మీరెవరు నా క్యారెక్టర్ గురించి ఆరోపణలు చేయడానికి అని దేవి నాగవల్లి మీద విశ్వక్ సేన్ ఫైర్ అయ్యాడు. దానికి దేవి నాగవల్లి కూడా తగ్గలేదు. ‘గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో’ అంటూ చాలా రూడ్ గా వార్నింగ్ ఇచ్చింది. మైక్ తీసేసి విశ్వక్ సేన్ స్టూడియో నుండి వెళ్ళిపోయాడు. దేవి నాగవల్లి-విశ్వక్ సేన్ గొడవ వీడియో అప్పట్లో వైరల్ అయ్యింది. కొందరు దేవి నాగవల్లికి సపోర్ట్ చేయగా, కొందరు విశ్వక్ సేన్ ని సమర్ధించారు.
అయితే ఈ సంఘటన మనసులో పెట్టుకున్న విశ్వక్ సేన్ దేవి నాగవల్లికి కౌంటర్ ఇచ్చాడంటున్నారు. ఆయన లేటెస్ట్ మూవీ దాస్ కా ధమ్కీ లో దేవి నాగవల్లికి కౌంటర్ గా ఆయన ఓ సన్నివేశం క్రియేట్ చేశారంటున్నారు. హీరో, హీరోయిన్ కారులో వెళుతుంటారు. ‘కారు మెడికల్ షాప్ దగ్గర ఆపాలా?’ అని హీరో హీరోయిన్ ని అడుగుతాడు. హీరోయిన్ ‘గెట్ అవుట్ ఆఫ్ మై కార్’ అంటుంది. ‘ఎందుకు కండోమ్స్ తేవడానికా?’ అని హీరో అంటాడు.

ఈ సన్నివేశంలో హీరోయిన్ నివేతా పేతురాజ్ బాడీ లాంగ్వేజ్ దేవి నాగవల్లిని పోలి ఉంది. దీంతో దేవి నాగవల్లికి విశ్వక్ సేన్ కౌంటర్ ఇచ్చారంటున్నారు. ఈ సన్నివేశం ఆమెను ఉద్దేశించి రాసుకుందే అని అంచనా వేస్తున్నారు. ఇక దాస్ కా ధమ్కీ చిత్రానికి ఆయన దర్శక నిర్మాత, రచయిత కూడాను. ఓపెనింగ్ కలెక్షన్స్ బాగానే రాబట్టిన ఈ మూవీ తర్వాత బాగా నెమ్మదించింది. దాస్ కా ధమ్కీ బయటపడే సూచనలు కనిపించడం లేదు.
