
Mogali Rekulu Heroine: సినిమాల కంటే సీరియళ్లకు ఇప్పుడు డిమాండ్ ఉంది. ఒక్కసారి సినిమాల్లో ఛాన్స్ కాదు.. ఒక్క అవకాశం బుల్లితెరపై ఇవ్వాలని చాలా మంది ప్రాథేయపడుతున్నారు. ఇటీవల ‘కార్తీక దీపం’ అనే సీరియల్ 1500 ఎపిసోడ్లకు పైగా వచ్చి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందే కొన్ని సీరియళ్లు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. మంజులనాయుడు, బిందునాయుడు కాంబినేషన్లో వచ్చిన మొగలిరేకులు, చక్రవాకం సిరీయళ్లు ఇప్పడు రీ షో చేసినా చూసేందుకు మహిళలు ఆసక్తి చూపుతారు. వాటిలో మొగలి రేకులు సిరియలో నటించిన వారంతా ఇప్పుడు మంచి పోజిషన్లో ఉన్నారు. ఇందులో మెయిన్ రోల్ లో నటించిన భామ లిఖిత కామిని. ఆమె లేటేస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మొగలిరేకులు సీరియల్ 2008 ఫిబ్రవరి 18న ప్రారంభమైంది. ఐదేళ్లపాటు సాగి 2013 మే 24న ముగిసింది. ఈ సిరియల్ వచ్చినన్నినాళ్లు మహిళలు, యువతులతో సహా యువకులు కూడా టీవీ ముందు వాలిపోయారు. ఎందుకంటే ఓ వైపు లవ్ స్టోరీని చూపిస్తూ మరోవైపు ఫ్యామిలీ ఎంటర్టైన్ గా ఆకట్టుకుంది. లవ్ స్టోరీలో భాగంగా సాగర్ హీరోగా, లిఖిత కామిని హీరోయిన్ గా నటించింది. వీరితో పాటు షీలా, ఇంద్రనీల్, మేధలు కూడా ప్రధానపాత్రల్లో నటించారు. ఇక హీరోగా నటించిన సాగర్ సినిమాల్లోనూ నటించారు. కానీ హీరోయిన్ నటించిన లిఖిత కామిని ఇప్పుడేం చేస్తుందంటే?
లికిత కామిని చిన్న వయసులోనే ఫిల్మ్ రంగంలోకి ఎంట్రి ఇచ్చారు. తొలుత ఆమె యాంకర్ గా కెరీర్ ప్రారంభించారు. ఈ సమయంలో 2008లో ఆమెకు మొగలిరేకులు సీరియల్ లో నటించే అవకాశం వచ్చింది. అయితే ఈ సీరియల్ సక్సెస్ కావడంతో అందులోనే కొనసాగారు. అయితే ఆ తరువాత సినిమాల్లోనూ అవకాశం వచ్చి నటించింది. కానీ ఆమె నటించిన సినిమాలు పెద్దగా రాణించకపోవడంతో అమ్మడుకు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ మరోమారు సీరియల్ లో నటించే ఛాన్స్ వచ్చినా ఈమె తిరస్కరించిందట.

లిఖిత కామిని ప్రస్తుతం వ్యాపార రంగంలో బిజీగా మారాయి. ఆమె జయప్రకాశ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ బాబు కూడా జన్మించారు. కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మళ్లి ఆమె సినిమాల జోలికి వెళ్లలేదు. సోషల్ మీడియాను కూడా ఆమె పట్టించుకోకపోవడంతో ఆమె ఎలా ఉందో ఇన్ని రోజులు తెలియలేదు. కానీ కొందరు వెతికి మరీ ఆమె ఫొటోలను నెట్టింట్లో పెట్టారు. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి.