Hero Vishal : తృటిలో ప్రాణాలతో బయటపడ్డ హీరో విశాల్.. ఆందోళనకు గురి చేస్తున్న వీడియో

Hero Vishal : మన తెలుగులో మంచి మాస్ క్రేజ్ సంపాదించుకున్న హీరోలలో ఒకడు విశాల్.పందెం కోడి , పొగరు , భరణి ,పిస్తా మరియు అభిమన్యుడు ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి మార్కెట్ ని సంపాదించుకున్న విశాల్ ప్రస్తుతం అటు తమిళంలోను ఇటు తెలుగులోనూ సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు.రీసెంట్ గా ఎన్నో దెబ్బలు తగిలించుకొని, ప్రాణాలను కూడా రిస్క్ లో పెట్టి చేసిన లాఠీ సినిమా కూడా డిజాస్టర్ ఫ్లాప్ […]

Written By: NARESH, Updated On : February 22, 2023 8:03 pm
Follow us on

Hero Vishal : మన తెలుగులో మంచి మాస్ క్రేజ్ సంపాదించుకున్న హీరోలలో ఒకడు విశాల్.పందెం కోడి , పొగరు , భరణి ,పిస్తా మరియు అభిమన్యుడు ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి మార్కెట్ ని సంపాదించుకున్న విశాల్ ప్రస్తుతం అటు తమిళంలోను ఇటు తెలుగులోనూ సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు.రీసెంట్ గా ఎన్నో దెబ్బలు తగిలించుకొని, ప్రాణాలను కూడా రిస్క్ లో పెట్టి చేసిన లాఠీ సినిమా కూడా డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది.

ఈ సినిమాతో విశాల్ మార్కెట్ మన తెలుగు లో పూర్తిగా జీరో అయిపోయింది.ఇప్పుడు ఆయన ఆశలు మొత్తం ‘మార్క్ ఆంటోని’ చిత్రం పైనే పెట్టుకున్నాడు.ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాని విశాల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు.ఈ సినిమా తో మళ్ళీ తనకి పూర్వ వైభవం లభిస్తుందని బలంగా నమ్ముతున్నాడు.

అయితే ఈ సినిమా షూటింగ్ లొకేషన్ లో ఒక చిన్న సాంకేతిక లోపం వల్ల షూటింగ్ లొకేషన్ మొత్తం తగలబడిపోవాల్సింది. సాంకేతిక నిపుణులు సరైన సమయం లో స్పందించి ప్రమాదం ని పసిగట్టి ఈ ప్రమాదం నుండి గట్టెక్కేలా చేసారు.ఈ సందర్భంగా హీరో విశాల్ ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ ‘కేవలం కొన్ని అంగుళాల దూరం లోనే చావు నుండి తప్పించుకున్నాను, ఒక్క సెకండ్ ఏమరుపాటు వహించిన నేను ఈరోజు చనిపోయాయి ఉండేవాడిని, ఈ ఘటన జరిగిన వెంటనే మళ్ళీ షూటింగ్ లో కూడా పాల్గొన్నాను’ అంటూ ట్వీట్ వేసాడు.విశాల్ ఈ విధంగా ట్వీట్ వేసేలోపు ఆయన ఫ్యాన్స్ ఒక్కసారిగా కంగారుకి లోనయ్యారు.కాస్త జాగ్రత్తలు వహించమని విశాల్ ని హెచ్చరించారు.విశాల్ కి ఇలాంటి రిస్కీ స్తంట్స్ కొత్తేమి కాదు.గతం లో ఆయన ఇలా ఎన్నో ప్రమాదాల నుండి తప్పించుకున్న సందర్భాలు ఉన్నాయి.