
Hero Surya: ప్రముఖ తమిళ హీరో సూర్య తన తండ్రి శివకుమార్ తో గత కొంతకాలం క్రితమే గొడవలు పెట్టుకొని సెపెరేట్ గా ఉంటున్నాడనే వార్త సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ప్రచారం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మొదటి నుండి ఉమ్మడి కుటుంబం గా ఉంటూ వచ్చిన సూర్య కుటుంబం ఇలా విడిపోవడం పై అభిమానుల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. వీళ్ళు మళ్ళీ కలిస్తే బాగుండును అని అనుకునే వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది.
అయితే ఇదంతా కేవలం రూమర్ అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సూర్య అంటే పడని వాళ్ళు పుట్టించిన పుకారు ఇది, ఇప్పటికీ సూర్య తన కుటుంబం తో ఎంతో సంతోషం గా ఉన్నాడు అంటూ కొంత మంది అభిమానులు చెప్పుకొస్తున్న మాట. కానీ రీసెంట్ గా సూర్య చేసిన ఒక పని చూస్తే ఇన్ని రోజులు సోషల్ మీడియా లో వచ్చిన రూమర్స్ నిజమే అని అనిపిస్తుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే సూర్య ఇటీవలే ముంబై లో 70 కోట్ల రూపాయిలను ఖర్చు చేసి ఒక అందమైన లగ్జరీ హౌస్ ని కొన్నాడట. తన భార్య జ్యోతిక మరియు పిల్లలను తీసుకొని శాశ్వతంగా చెన్నై వదిలి ముంబై వెళ్ళిపోయాడట సూర్య. ఆయన తీసుకోవాలనుకుంటే చెన్నై లోనే ఎదో ఒక ప్రాంతం లో తీసుకోవచ్చు. కానీ ముంబైలోనే ఏరికోరి తీసుకోవడానికి కారణం ఏమిటి..? ఆయనకీ బాలీవడ్ లో ఆఫర్లు వరుసగా వస్తున్నాయా..?, ఎంత బాలీవుడ్ సినిమాలు చేసిన తమిళ సినిమాని మాత్రం వదలడు కదా, ఎప్పుడేమి చేస్తాడు..? అని కొంతమంది అభిమానులు సందేహ పడుతున్నారు.

అయితే గత సంవత్సరం నుండి సూర్య ముంబైలోనే నివాసం ఉంటున్నాడు. అక్కడి నుండే చెన్నై కి వచ్చి షూటింగ్ లో పాల్గొనే వాడట.ఇక నుండి కూడా అలాగే చేస్తాడని అంటున్నారు అభిమానులు. పాలు నీళ్లు లాగ కలిసి ఉండే సూర్య ఉమ్మడి కుటుంబం మళ్ళీ కలవాలని అభిమానులు ఆ దేవుడిని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.