Hero Nani : హీరో నాని డ్రైవర్ గా కూడా పనిచేసాడా.. కన్నీళ్లు రప్పిస్తున్న లేటెస్ట్ కామెంట్స్

Hero Nani : మెగాస్టార్ చిరంజీవి ని ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.కానీ చాలా మందికి ఇప్పటికీ సినిమాల్లో అవకాశాలు రాక కృష్ణనగర్ లో గడిపేస్తున్నారు.కానీ కొంతమంది హీరోలు మాత్రం బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి అదృష్టం కలిసొచ్చి నేడు స్టార్స్ గా ఒక వెలుగు వెలుగుతున్నారు.వారిలో మాస్ మహారాజ రవితేజ ఒకడైతే, న్యాచురల్ స్టార్ నాని మరొకడు. ఇద్దరు కూడా సినిమాల్లో అవకాశాలు సంపాదించడం కోసం ఎన్నో […]

Written By: NARESH, Updated On : March 27, 2023 8:54 pm
Follow us on

Hero Nani : మెగాస్టార్ చిరంజీవి ని ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.కానీ చాలా మందికి ఇప్పటికీ సినిమాల్లో అవకాశాలు రాక కృష్ణనగర్ లో గడిపేస్తున్నారు.కానీ కొంతమంది హీరోలు మాత్రం బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి అదృష్టం కలిసొచ్చి నేడు స్టార్స్ గా ఒక వెలుగు వెలుగుతున్నారు.వారిలో మాస్ మహారాజ రవితేజ ఒకడైతే, న్యాచురల్ స్టార్ నాని మరొకడు.

ఇద్దరు కూడా సినిమాల్లో అవకాశాలు సంపాదించడం కోసం ఎన్నో ఇబ్బందులను ఎదురుకున్నారు.ఇద్దరి కెరీర్స్ కూడా అసిస్టెంట్ డైరెక్టర్స్ గానే ప్రారంభం అయ్యాయి.కస్టపడి పైకొచ్చిన ఈ ఇద్దరు హీరోలు కలిసి ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చెయ్యలేదు కానీ, రీసెంట్ గా ఇద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.నాని హీరో గా నటించిన ‘దసరా’ ఈ నెల 30 వ తారీఖున విడుదల అవ్వబోతుండగా , రవితేజ లేటెస్ట్ మూవీ ‘రావణాసుర’ వచ్చే నెల 7 వ తారీఖున విడుదల కానుంది.

ఒకరి మూవీ ఒకరు ప్రమోట్ చేసుకున్నట్టు ఉంటుందని ఇద్దరు కలిసి ఒకే ఇంటర్వ్యూ లో పాల్గొనే ఆలోచనతో మన ముందుకి వచ్చాడు.సినిమాకి సంబంధించిన ముచ్చట్లు మాట్లాడుకుంటూనే, తమ జీవితాల్లో సినిమా అవకాశాల కోసం పడిన కష్టాల గురించి కూడా చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ‘సినిమాల్లో అవకాశాలు కోసం నా ఫోటో ఆల్బం ని పట్టుకొని తిరగని స్టూడియో అంటూ ఏది మిగలలేదు.ఏ స్టూడియో లో కూడా నాకు కనీసం ఎంట్రీ కూడా దక్కేది కాదు,నేను రోజు తిరుగుతూ ఉండడాన్ని గమనించిన ఇద్దరు ప్రముఖ డైరెక్టర్స్ సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తాము అని చెప్పి నన్ను డ్రైవర్ గా వాడుకునే వాళ్ళు. వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న పనులకు కూడా నన్ను తిప్పేవారు, చివరికి నేను నా పుట్టిన రోజు కోసం దాచుకున్న డబ్బులను కూడా వాళ్ళ పనుల కోసమే ఖర్చు చేశాను’ అంటూ నాని ఎమోషనల్ గా మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.