Superstar Krishna Health: సీనియర్ నటుడు కృష్ణ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేయడం ఇండస్ట్రీలో కలకలం రేపింది. ఈరోజు ఉదయం ఆయన అస్వస్థతకు గురికావడంతో బంధువులు ఆయనను కాంటినెంటల్ హాస్పిటల్ కు తరలించారు. ప్రాథమికంగా పరీక్షించిన వైద్యులు వివరాలు తరువాత వెల్లడిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో కృష్ణ ఆస్పత్రిలో చేరిన విషయం తెలియగానే ఆయన కుమారుడు, ప్రిన్స్ మహేష్ బాబు హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు. ఆయనతో పాటు కొంతమంది సినీ ప్రముఖులు సైతం ఆసుపత్రికి వస్తున్నారు. అయితే కృష్ణ గుండెపోటుకు గురయ్యాడా..? లేక ఇతర అనారోగ్య సమస్యలా..? అని తీవ్రంగా చర్చించుకుంటున్నారు.

సూపర్ స్టార్ కృష్ణ ప్రస్తుతం గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే కొన్ని రోజుల నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన సతీమణి ఇందిర మరణించినప్పుడు కృష్ణ ఆమె పార్థివదేహం పక్కనే ఉన్నారు. ఆ సమయంలో కృష్ణ ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ తరువాత నుంచి ఆయన శరీరంలో అనేక మార్పులు వచ్చాయని చర్చించుకుంటున్నారు.
అయితే సీనియర్ నటుడు అయిన కృష్ణ ఆరోగ్య సూత్రాలు పాటించి ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. కొన్ని ఇతర కారణాల వల్ల ఆయన ఆరోగ్యం క్షీణించి నట్లు చర్చించుకుంటున్నారు. మరోవైపు శ్వాస సంబంధిత సమస్యలని తెలుస్తోది. ఏదీ ఏమైనా వైద్యులు బులిటెన్ రిలీజ్ చేసేవరకు సస్పెన్షన్ గానే ఉంది. అయితే కృష్ణ కుమారుడు నరేష్ మాట్లాడుతూ ‘కృష్ణ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారు ’ అని తెలిపారు.

కృష్ణకు గుండెపోటు వచ్చిందనే అంటున్నారు. ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నా.. వాటి కారణంగానే కార్డియాట్రిక్ సమస్యలు వచ్చాయని అంటున్నారు. కృష్ణ కు అస్వస్థత అన్న విషయం తెలియగానే మహేశ్ హుటాహుటిన ఆసుపత్రికి బయలుదేరారు. అక్కడికి వెళ్లిన తరువాత కుటుంబ సభ్యులను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇటీవల తన తల్లి మరణించిన విషాదం నుంచి కోలుకోకముందే మహేష్ తండ్రి కృష్ణ ఆస్పత్రికి వెళ్లడం ఆవేదనను మిగిల్చింది. ఈ నేపథ్యంలో మహేష్ ఫ్యాన్స్ తో పాటు ఇతర ఆడియన్స్ ఆయనను పరామర్శిస్తున్నారు.