Superstar Krishna- Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ గారి ఆరోగ్యం విషమం..ఆసుపత్రికి తరలించారు అని ఈరోజు ఉదయం వచ్చిన ఒక వార్త అభిమానులను కలవరానికి గురి చేసింది..చాలా కాలం నుండి ఆయన శ్వాసకి సంబంధించి తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని..ఈరోజు అది తీవ్ర రూపం దాల్చడం తో అత్యవసర చికిత్స నిమ్మితం ఆయనని హాస్పిటల్ కి తరలించారని మీడియా లో వార్తలు వచ్చాయి..కృష్ణ గారి ఆరోగ్యానికి ఏమి జరగకూడదని..ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడాలని అభిమానులు దేవుడికి ప్రార్థనలు చెయ్యడం మొదలు పెట్టారు..అయితే దీనిపై మహేష్ బాబు టీం స్పందించింది.

‘కృష్ణ గారి ఆరోగ్యం నిలకడగానే ఉంది.. జనరల్ చెకప్ కోసం ఆయన నేడు హాస్పిటల్ కి వెళ్లారు..అభిమానులెవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని క్లారిటీ ఇవ్వడం తో ఫాన్స్ ఊపిరి పీల్చుకున్నారు..ఈమధ్యనే కృష్ణ గారి సతీమణి ఇందిరా దేవి గారు స్వర్గస్తులైన విషయం మన అందరికి తెలిసిందే..ఈ బాధ నుండి ఘట్టమనేని కుటుంబం మరియు అభిమానులు ఇంకా పూర్తిగా బయటపడకుండానే కృష్ణ గారికి అనారోగ్యం అని వార్త రావడం తో అభిమానులు శోకసంద్రం లో మునిగిపోయారు.
ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగా ఉంది..ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారికంగా ప్రకటన వచ్చినప్పటికీ కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కృష్ణ గారి ఫాన్స్ ఆయన పేరు మీద ప్రత్యేకమైన పూజలు చెయ్యడం ప్రారంభించారు..పెద్ద వయస్సు లో కూడా విరామం లేకుండా సినిమాలు చేసే కృష్ణ గారు వెండితెర కి దూరమై సుమారు 6 ఏళ్ళు అయ్యింది..ఆయన హీరోగా చివరిసారి వెండితెర మీద కనిపించిన ‘శ్రీశ్రీ’ అనే చిత్రం 2016 వ సంవత్సరం లో విడుదలైంది..ఆ తర్వాత ఆరోగ్యం సహకరించకపోవడం తో సినిమాలకు శాశ్వతంగా గుడ్ బాయ్ చెప్పేసారు కృష్ణ గారు.

అయితే పెద్ద వయస్సు లో విజయ నిర్మల గారి మరణం..పెద్ద కొడుకు రమేష్ బాబు గారి మరణం మరియు రీసెంట్ గా సతీమణి ఇందిరా దేవి గారి మరణం..ఇలా తనకి ఎంతో ఇష్టమైన వారందరు ఒక్కొక్కరిగా చనిపోవడం..కృష్ణ గారిని మానసికంగా ఎంతో కృంగదీసింది..ఆయనకీ ఇలాంటి సమయం లో ఆ దేవుడు మనోధైర్యం ఇచ్చి సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా చూడాలని ప్రార్థిద్దాము.