Homeట్రెండింగ్ న్యూస్Australian Bartender: రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు.. సీన్‌ కట్‌చేస్తే జైల్లో ఉన్నాడు

Australian Bartender: రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు.. సీన్‌ కట్‌చేస్తే జైల్లో ఉన్నాడు

Australian Bartender: ఒక వ్యక్తికి ఏటీఎం నుంచి ఊహించని విధంగా కుప్పులు కుప్పలుగా డబ్బు వచ్చింది. దీంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ నడిమంత్రపు సిరి అతడు ఉద్యోగం కోల్పోయేలా చేసింది. ప్రియురాలిని కూడా కాదనుకున్నాడు. కానీ, చివరికి అతడిని కూడా కటకటాలపాలయ్యేలా చేసింది. ఆస్రేలియాలోని ఒక బార్‌లో పనిచేసే సర్వర్‌ డాన్‌ సాండర్స్‌కి ఊహించని విధంగా ఏటీఎం నుంచి కట్టకట్టలుగా డబ్బు లభించింది. దీంతో అతను రాత్రికి రాత్రే మిలియనీర్‌గా మారిపోయాడు. ఒక రోజు రాత్రి బాగా మద్యం సేవించి ఆస్ట్రేలియాలోని వాంగారట్టాలో ఏటీఎం వద్దకు వెళ్లాడు. అప్పుడే అతను ఊహించని విధంగా ఏటీఎం నుంచి సుమారు రూ.13 కోట్ల నగదును పొందాడు.

Australian Bartender
Australian Bartender

అసలేం జరిగింది..
అతను ఏటీఎం వద్దకు వెళ్లి డబ్బులు డ్రా చేస్తున్న ప్రతీసారి ట్రై ఎగైన్‌ అని రావడంతోపాటు పెద్ద మొత్తంలో డబ్బులు ఏటీఎం నుంచి వచ్చేస్తుండేవి. ఇలా అతను మూడుసార్లు చేయగా… మూడుసార్లు పెద్దమొత్తంలో డబ్బు వచ్చింది. కానీ ఏటీఎం మెషీన్‌ మాత్రం లావాదేవీలు జరుపుతున్నంత సేపు ట్రాన్‌జాక్షన్‌ క్యాన్సిల్డ్‌ అని రావడం.. డబ్బులు మాత్రం వచ్చేయడం జరుగింది. అంతేకాదు.. డాన్‌ సాండర్స్‌ ఖాతా నుంచి డబ్బులు కట్‌ అయినట్లు కూడా రాలేదు. దీంతో సర్వర్‌ సాండర్స్‌కి తాగిన మత్తంతా దిగిపోయింది. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కాక ఆ రాత్రికి ఇంటికి వెళ్లిపోయాడు.

బ్యాంక్‌ నెట్‌వర్క్‌ డిస్‌కనెక్ట్‌
ఆ మరుసటి రోజు బ్యాంకుకు ఫోన్‌ చేసి సంప్రదిస్తే ఎలాంటి అవాంఛనీయమైన నగదు బదిలీలు జరగలేదని తెలిపారు. అసలు ఏమైంది ఎందుకు ఇలా జరిగిందని సర్వర్‌ సాండర్స్‌ వాకాబు చేస్తే ఆ రోజు రాత్రి 1 గంట నుంచి 3 గంటల వరకు బ్యాంక్‌ నెట్‌వర్క్‌ డిస్‌కనెక్ట్‌ అయ్యిందని గ్రహించాడు. అదీగాక తాను ఆరోజు ఏటీఎంలో సేవింగ్‌ అకౌంట్‌లోని కొంత సొమ్మును క్రెడిట్‌ కార్డుకి ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నసమయంలోనే ఇంత పెద్ద మొత్తంలో దాదాపు రూ.13 కోట్ల నగదు బయటకు వచ్చిందని కనుగొన్నాడు.

ఊహించని డబ్బుతో జల్సాలు..
ఊహించని విధంగా వచ్చిపడ్డ డబ్బు కావడం, నెట్‌వర్క్‌ డిస్‌ కనెక్టుతో తాను తీసిన్లు ఎక్కడా రికార్డు కాకపోవడంతో సర్వర్‌ సాండర్స్‌ విచ్చల విడిగా జల్సాలు చేస్తూ ఎంజాయ్‌ చేశాడు. స్నేహితులు యూనివర్సిటీలు ఫీజులు కట్టడం, ఉన్నత చదువులకు స్నేహితులను ఫారిన్‌ పంపించే పనులు వంటి సాయాలు కూడా చేశాడు. మితిమీరిన జల్సాల కారణంగా బార్‌లో ఉద్యోగాన్ని, గర్లఫ్రెండ్‌ని పోగొట్టుకున్నాడు. అంతేకాదు ఆ డబ్బును మొత్తం ఐదునెలల్లో ఖర్చు పెట్టేశాడు. ఇదిలా బ్యాంకు అధికారులు ఆలస్యంగా ఏటీఎంలో ఫ్రాడ్‌ జరిగిందని ఎవరో వ్యక్తి అధిక మొత్తంలో డబ్బును పొందినట్లు గుర్తిస్తారు.

Australian Bartender
Australian Bartender

పోలీసుల విచారణతో కటకటాల పాలు..
బ్యాంకు అధికారులు పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు ఇలా అక్రమంగా అధిక మొత్తంలో డబ్బుని పొందింది సర్వర్‌ సాండర్స్‌గా గర్తించి అరెస్టు చేశారు. పోలీసులు నిందితుడు సాండర్స్‌పై 111 అభియోగాలతో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఘటన 2011లో జరిగింది. అతను సుమారు ఐదేళ్లు జైలు శిక్షను కూడా అనుభవించాడు. అతను 2016లో జైలు నుంచి విడుదలయ్యాడని ప్రస్తుతం ఒక బార్‌లో పనిచేస్తున్నాడని ఆస్ట్రేలియా పోలీసులు తెలిపారు. ఐతే ఆస్ట్రేలియా పోలీసులు ఫ్రాడ్‌ కేసుల విషయం చెబుతూ… ఆన్‌లైన్‌లో ఈ ఘటన గురించి చెప్పడంతో ఈ విషయం కాస్త సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతోంది. అందుకే అంటారు డబ్బెవరి సొంతం కాదని.. ఎవరిదగ్గరా ఎక్కువ రోజులు నిలవదని.. కష్టపడకుండా వచ్చిన డబ్బు మనల్ని కూడా కష్టాలపాలు చేస్తుందని..!

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version