Uttar Pradesh: మనదేశంలో నూటికి 80 శాతం పెళ్లిళ్లు సంప్రదాయబద్ధంగానే జరుగుతాయి. అబ్బాయి, అమ్మాయిలకు పెళ్లీడు రాగానే పెద్దలు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెడతారు. అన్నీ అనుకున్నాక పెళ్లి జరిపిస్తారు. అయితే పెద్దలు నిర్ణయించిన వివాహాల కన్నా ప్రేమ పెళ్లిళ్లలో ఎక్కువ స్వేచ్ఛ ఉంటుందని నేటితరం భావిస్తోంది. ముఖ్యంగా యువతులు తమకు నచ్చినవాడితో మనువు తమకు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుందనుకుంటున్నారు. అన్నింటికీ మించి పెళ్లి తమ ఇష్టానికి అనుకూలంగా జరిగిందన్న ఆనందం వారికి మరింత ఉపశమనాన్నిస్తుంది. ఇలాగే తన భార్య ప్రియుడిని ఇష్టపడుతుందని ఆమె మనసు తెలుసుకున్న ఓ భర్త.. ఆమె అభీష్టం ప్రకారమే ప్రియుడితోనే పెళ్లి జరిపించాడు.
బిహార్‌లో ఘటన..
బీహార్ సవాడాకు చెందిన మహిళకు పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నాయి. అయితే పెళ్లికి ముందు ప్రేమించిన యువకుడితో ఇంకా సదరు మహిళా ప్రేమాయణం కొనసాగిస్తోంది. సదరు ప్రియుడికి కూడా పెళ్లయి ముగ్గురు పిల్లలు ఉన్నారు. మహిళ చనువిస్తుండడంతో ఆ ప్రియుడు భర్త లేని సమయంలో తన మాజీ ప్రియురాలి ఇంటికి వస్తున్నాడు. ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు.
రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని..
ఈ క్రమంలో ఓ రోజు బయటకు వెళ్లిన సమయంలో భార్య ప్రియుడి ఇంట్లో దూరాడు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దేహశుద్ధి చేశారు. పెళ్లయి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నాక ఇదేం పనని నిలదీశారు. అంతేకాదు.. ప్రియుడికి కూడా భార్య ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలియడంతో మరో నాలుగు దెబ్బలు ఎక్కువ వేశారు. ఇంతలో భర్త అక్కడకు చేరుకున్నాడు. విషయం తెలుసుకుని షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.
గుడిలో ఇద్దరికీ పెళ్లి..
వెంటనే తన భార్యతోపాటు ఆమె ప్రియుడిని గుడికి తీసుకెళ్లాడు. అక్కడే దేవుడి సమక్షంలో.. వేదమంత్రాల సాక్షిగా ఇద్దరికీ పెళ్లి జరిపించాడు. దీనిని చూసి అందరూ షాక్ అయ్యారు. ఇద్దరు పిల్లలు ఉన్న తన భార్యను ముగ్గురు పిల్లలు ఉన్న ప్రియుడికి ఇచ్చి వివాహం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషయమై భర్తను వివరణ కోరగా, భార్య, పిల్లలు ఉన్న ఇంటికి తన భార్య కూడా వెళితే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు అతనికి తెలుస్తుందన్నాడు. ఈ విషయం తెలియాలనే వారికి పెళ్లి చేశానని చెపాపడు. తన ఇద్దరు పిల్లలను తానే చూసుకుంటానని పేర్కొన్నాడు.
గతంలో యూపీలో..
గతంలో ఉత్తర ప్రదేశ్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. సుజిత్ అలియాస్ గోలు అనే వ్యక్తి ఫిబ్రవరి 19న శ్యామ్ నగర్‌లో శాంతి అనే యువతిని పెళ్లాడాడు. పెళ్లయిన కొద్ది రోజులకే శాంతి ఎవరికీ చెప్పకుండా పుట్టింటికి వెళ్లింది. ఎన్ని రోజులైనా భార్య తిరిగి రాకపోవడంతో సుజిత్ ఆమెను కలిశాడు. ఇంటికి ఎందుకు రావడం లేదో చెప్పమని అడిగాడు.
ప్రేమ వ్యవహారం చెప్పడంతో..
తన ప్రేమ విషయాన్ని భర్తకు చెప్పి కంటతడి పెట్టుకుంది.‘లక్నోకు చెందిన రవిని ప్రేమించాను. కానీ నాకిష్టం లేకుండానే మీతో పెళ్లి చేశార’ని ఏడుస్తూ చెప్పింది. భార్యను అర్ధం చేసుకున్న సుజిత్ ప్రియుడితో పెళ్లి జరిపిస్తానని చెప్పాడు. తన భార్య కోరిక నెరవేర్చడం కోసం సుజిత్ లక్నో వెళ్లి రవిని కలిశాడు. ముగ్గురూ కలిసి పెళ్లికి ప్లాన్ చేశారు. తర్వాత సుజిత్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. స్థానిక హనుమాన్ ఆలయంలో కుటుంబ సభ్యుల సమక్షంలో తన భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించాడు.