Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan- Chandrababu: చంద్రబాబుకు పవన్ కు మధ్య దూరం పెరిగిందా? : ఇదే సాక్ష్యం

Pawan Kalyan- Chandrababu: చంద్రబాబుకు పవన్ కు మధ్య దూరం పెరిగిందా? : ఇదే సాక్ష్యం

Pawan Kalyan- Chandrababu
Pawan Kalyan- Chandrababu

Pawan Kalyan- Chandrababu: పవన్ కళ్యాణ్ తారకరత్న అంత్యక్రియలకు గైర్హాజరు కావడంతో… ఆయన గైర్హాజరు కావడానికి గల కారణాలపై సోషల్ మీడియాలో ఊహాగానాలు సాగుతున్నాయి. ఆయన అస్వస్థతతో ఉన్నారని కొందరు పోస్ట్‌లు చేయగా, మరికొందరు నాగబాబు, నాదెండ్ల మనోహర్ వంటి ఇతర మిత్రుల గైర్హాజరీని గుర్తించారు. పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో సంతాప సందేశాన్ని కూడా పోస్ట్ చేయకపోవడం గమనార్హం. ఈ పరిణామాలు చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ దూరం అవుతున్నారేమో లేదా బహుశా పెద్ద సమస్యపై ఆయనతో చర్చలు జరుపుతున్నారనే అభిప్రాయం కలుగుతోంది.

తెలంగాణలో తమ పార్టీ కోసం ప్రచారం చేయడానికి పవన్ కళ్యాణ్‌కు బీఆర్ ఎస్ రూ .1000 కోట్లు ఆఫర్ చేసిందని, దీని వల్ల టీడీపీ మద్దతు లేకుండా ఆంధ్రప్రదేశ్‌లో స్వతంత్రంగా పోటీ చేయవచ్చని ఆంధ్రజ్యోతిలో ఇటీవల ఓ కథనం ప్రచురితమైంది.
టీడీపీ కంటే తమ పార్టీ బెటర్ అని పవన్ కల్యాణ్ విశ్వసిస్తున్నారని, చంద్రబాబు నాయుడుతో పొత్తు కంటే ఒంటరిగా పోరాడితేనే తనకు లాభం చేకూరుతుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు అంతర్గత సమాచారం.

ఇదే జరిగితే వెన్నుపోటు పొడిచి తనదైన చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడుకు గట్టి కౌంటర్ ఇచ్చిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అవుతారు అని పొలిటికల్ వర్గాలు అంటున్నాయి. ఇది ముందే తెలిసి, తన భాస్ కు అన్యాయం జరగొద్దని ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ రూ. 1000 కోట్ల డీల్ జరిగిందని రాసుకొచ్చాడు. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. గాలికి పోయే పేలపిండి లాంటి వార్తలను ఎందుకు పట్టించుకోవాలని పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇక తారకరత్న అంత్యక్రియలకు ఆయన గైర్హాజరు కావడం చంద్రబాబు నాయుడుతో ఆయనకు ఉన్న సంబంధాలపై ఊహాగానాలకు దారితీసింది.

Pawan Kalyan- Chandrababu
Pawan Kalyan- Chandrababu

మరో వైపు అధికార పార్టీ తప్పిదాలపై జనసేన నాయకులు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే గ్రీవెన్స్ డే లాంటి కార్యక్రమాల్లో నేరుగా ఫిర్యాదులు చేస్తున్నారు.. సొంత మీడియా లేకపోయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా జగన్ పార్టీ తప్పులను ఎండ గడుతున్నారు.. మరోవైపు యువతరం పవన్ కళ్యాణ్ కు అండదండగా ఉంటుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్న నేపథ్యంలో… ఆంధ్రప్రదేశ్లో ప్రభల శక్తిగా ఎదగాలని జనసేన ఆరాటపడుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.. ప్రస్తుత పరిస్థితి ప్రకారం తెలుగుదేశం కంటే జనసేన ఎక్కువ బలంగా కనిపిస్తుందని వారు చెప్తున్నారు. వచ్చే పరిస్థితిని తాము అంచనా వేయలేమని, కానీ ఇప్పటికైతే చంద్రబాబు కంటే పవన్ కళ్యాణ్ ను చూస్తేనే జగన్ భయపడతారని వారు వివరిస్తున్నారు.

 

సామాజిక న్యాయం, సంక్షేమం పేరుతో పాలనా వైఫల్యాల్ని కప్పిపుచ్చటం సాధ్యమా ? || CM Jagan || Ok Telugu

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version