Taj Hotel: ఫైవ్ స్టార్ హోటళ్లలో ఆహారం తినాలంటే చాలా మర్యాదగా వ్యవహరించాల్సి ఉంటుందని చాలా మంది భావిస్తారు. మంచి దస్తులు వేసుకుని వెళ్లి స్టైల్‌గా తింటూ, కార్డులతో బిల్లు కడతారు. అయితే, ముంబైకి చెందిన యువకుడు సిద్ధేశ్ లోకరే తాజ్ హోటల్‌కు వెళ్లి ఆహారం తిని, బిల్లును చిల్లర రూపంలో చెల్లించి షాక్ ఇచ్చాడు. ఆ సమయంలో వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
ఫైవ్‌స్టార్ హోట్‌లో తినాలని..
ముంబైకి చెందిన సిద్దేశ్ లోకరే తాజ్ హోటల్‌కు వెళ్లాలనుకున్నాడు. అందులోకి వెళ్లాలంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి అనే నిబంధనలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడికి వెళ్లినవారంతా తిన్న తర్వాత 90 శాతం మంది కార్డులతో బిల్లు కడతారని తెలుసుకున్నాడు. 10 శాతం మంది మాత్రమే క్యాష్ ఇస్తారని తాజ్ హోల్ రూల్స్ చెప్పడంతో సిద్ధేశ్‌కు ఓ ఐడియా వచ్చింది.
సూటు బూటుతో హోటల్‌కి..
తాజ్ హోటల్ రూల్స్ ప్రకారమే సిద్ధేశ్ సూటు, బూటు వేసుకుని తాజ్ హోటల్‌కు బయల్దేరాడు. సిద్ధేశ్ ఆహార్యం చూసి అక్కడ సిబ్బంది అతనికి గ్రాండ్‌గా వెల్కం చెప్పారు. లోపలికి వెళ్లిన సిద్ధేశ్‌కు అక్కడి బేరర్ వంగి వంగి నమస్కరిస్కూ వెల్కం సార్ అంటూ మర్యాదలు చేశారు. ఏమేం కావాలో నోట్ చేసుకున్నాడు.
ఇష్టమైనవన్నీ తిని..
తాజ్ హోటల్‌లో తినాలన్న కోరికతో వెళ్లిన సిద్ధేశ్ అక్కడ తనకు ఇష్టమైన పిజ్జా, మాక్‌టెయిల్స్ ఆర్డర్ ఇచ్చాడు. కడుపునిండా తిన్నాడు. వెయిటర్ కూడా కొసిరి కొసిరి వడ్డించాడు. కడుపు నిండా తిన్న తర్వాత వెయిటర్‌ను బిల్లు అడిగాడు. వెంటనే సదరు వెయిటర్ బిల్లు తెచ్చి టేబుల్‌పై పెట్టాడు. బిల్ ఎంత అయిందో చూశాడు.
కాయిన్స్ తీసి టెబుల్‌పై పెట్టాడు..
వెంటనే తన వెంట తెచ్చుకున్న బ్యాగు లె రిచిన సిద్ధేశ్ అందులో నుంచి కాయిన్స్ మూఠ తీశాడు. దానిని టేబుల్‌పై పెట్టి లెక్కించడం షురూ చేశాడు. దీంతో అక్కడ ఉన్న ఇతర కస్టమర్లు నవ్వుకున్నారు. బిల్‌ను చిల్లర రూపంలో వెయిటర్‌కు ఇచ్చాడు సిద్ధేశ్. ఆ చిల్లర తీసుకుని లెక్కపెట్టుకోవడానికి వెయిటర్ వెళ్లిపోయాడు. అనంతరం సిద్ధేశ్ హోటల్ నుంచి ఇంటికి వెళ్లాడు. దీన్నంతా షూట్‌చేసి తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.