
Ravi Teja – Harish Shankar : సినీ పరిశ్రమలో మాస్ మహారాజుగా పేరుపొందిన నటుడు రవితేజ. దర్శకుడు కావాలని వచ్చి యాక్టర్ గా మారిన రవితేజ సినిమాలంటే ప్రజలు ఎంతో ఇష్టపడతారు. ఇండస్ట్రీలో ఎలాంటి బలం లేకపోయినా స్వశక్తితో ఎదిగిన నటుడు. సినిమాల ఎంపికలో తనదైన శైలిలో సినిమాలు తీసి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేస్తున్నాడు. కథల విషయంలో జాగ్రత్తగా ఉండటం ఆయన నైజం. కొత్త దర్శకులకు సినిమాల అవకాశం వచ్చి వారిని ప్రోత్సహించడం ఆయన ప్రత్యేకత.
దర్శకుడిగా హరీష్ శంకర్ కు మొదటిసారి షాక్ సినిమా అవకాశం ఇచ్చారు. అది బాగా ఆడకపోయినా నమ్మకంతో మిరపకాయలో మరో చాన్స్ కల్పించారు. దీంతో హిట్ సాధించి ఇద్దరి కాంబినేషన్ సూపర్ అని నిరూపించారు. అలా వారి ప్రస్థానం మొదలైంది. ఇప్పుడు హరీష్ శంకర్ మంచి ఫామ్ లో ఉన్న దర్శకుడు అయ్యారు. పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లకు మంచి హిట్లు ఇచ్చి మెగా ఫ్యామిలీకి మంచి హిట్లు ఇస్తున్నారు. ఇలా హరీష్ శంకర్ ప్రస్తుతం తెలుగు దర్శకుల్లో హస్తవాసి ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు.
హరీష్ శంకర్, రవితేజ, సుశాంత్ ముగ్గురు ఓ ఇంటర్వ్యూలో సరదాగా పాల్గొన్నారు. దీంట్లో హరీష్ శంకర్ ప్రశ్నలు వేస్తే రవితేజ సమాధానాలు చెబుతున్నాడు. కానీ హరీష్ సరదాగా ఇది ఇంటర్వ్యూ కాదు రవితేజ నన్ను ర్యాగింగ్ చేస్తున్నాడు అంటూ సరదా కామెంట్లు చేశాడు. కొత్తవారికి హిట్ ఉందా లేదా అనే విషయం ఆలోచించకుండా వారిలో ఉన్న టాలెంట్ ను ప్రోత్సహిస్తూ సినిమాలు తీయడం రవితేజకు అలవాటే. దీంతో ప్రస్తుతం సుధీర్ వర్మకు రావణాసుర అనే సినిమా చేసే అవకాశం ఇచ్చాడు. దీనిపై హరీష్ శంకర్ రవితేజను పలు ప్రశ్నలు అడిగారు.
సినిమా గురించి చెప్పమంటే అది కుదరదు అని రవితేజ తేల్చేశాడు. సినిమా కథ చెప్పకూడదు కదా అని అన్నాడు. దీంతో అందులో సుశాంత్ కూడా ఉన్నట్లు చెబుతున్నారు. సుశాంత్ ది విలన్ క్యారెక్టర్ అని వారి మాటల్లో అర్థమవుతోంది. ఇలా రవితేజ తన సినిమాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుని హిట్లు సాధిస్తుంటాడు. కథల విషయంలో కొత్త వారిని ప్రోత్సహిస్తూ వారిలోని టాలెంట్ ను వాడుకుంటూ దూసుకుపోతుంటాడు. ఇలా హరీష్ శంకర్, రవితేజ, సుశాంత్ ముగ్గురు కలిసి సరదాగా మాట్లాడుకున్నారు.