https://oktelugu.com/

Harsha Sai And Sunny Yadav: యూ ట్యూబర్లు హర్ష సాయి, సన్నీ యాదవ్ కు షాక్ ఇచ్చిన సజ్జనార్ సార్..

Harsha Sai And Sunny Yadav : సోషల్ మీడియా వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. అదే స్థాయిలో నష్టాలు ఉన్నాయి. సోషల్ మీడియాను ఉపయోగించి కొంతమంది అక్రమార్కులు బెట్టింగ్ యాప్స్, ట్రేడ్ యాప్స్ నిర్వహిస్తున్నారు. భారీగా లాభాలు వస్తాయని ఆశపెట్టి అమాయకులను మోసం చేస్తున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : March 16, 2025 / 06:02 PM IST
    Harsha Sai And Sunny Yadav

    Harsha Sai And Sunny Yadav

    Follow us on

    Harsha Sai And Sunny Yadav: రోజురోజుకు ఇలాంటి యాప్స్ వల్ల మోసపోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. తెలంగాణ రాష్ట్ర సైబర్ పోలీసులకు ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువవుతున్నాయి. దీంతో పోలీసులు బెట్టింగ్ యాప్స్ ను కట్టడి చేయాలని.. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదించారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. అంతేకాదు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే సెలబ్రిటీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో.. వారు కూడా వెనక్కి తగ్గారు. ఇప్పటికే క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురు సుప్రియ తన సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేసింది. తాను ఒక ట్రేడ్ యాప్ ను ప్రమోట్ చేశానని.. తనను మిస్ గైడ్ చేశారని.. దయచేసి అటువంటి ట్రేడ్ యాప్స్ లో ఎవరూ పెట్టుబడులు పెట్టొద్దని.. అటువంటి వాటిని నమ్మొద్దని ఆమె తన వీడియో సందేశంలో పేర్కొన్నారు. గెటప్ శ్రీను కూడా అదేవిధంగా వీడియోను విడుదల చేశారు. ఎట్టి పరిస్థితుల్లో గేమింగ్, ట్రేడింగ్ యాప్స్ ను నమ్మొద్దని కోరారు..

     

    Also Read: పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ రిలీజ్ కి మోక్షం దక్కేది అప్పుడేనా..?

     

    హర్ష సాయి, సన్నీ యాదవ్ కు షాక్

    బెట్టింగ్ యాప్స్, ట్రేడింగ్ యాప్స్ పై తెలంగాణ పోలీసులు ఉక్కు పాదం మోపిన నేపథ్యంలో.. సన్నీ యాదవ్, యూట్యూబర్ హర్ష సాయిపై కేసులు నమోదయ్యాయి. వీరిద్దరూ బెట్టింగ్, ట్రేడ్ యాప్స్ ను ప్రమోట్ చేసే విధంగా వ్యవహరించారు. తమ సోషల్ మీడియా ఖాతాలలో ఆ వీడియోలను పోస్ట్ చేశారు. దీంతో వారిపై సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక ఇదే విషయాన్ని సజ్జనార్ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ” నేను వ్యక్తిగతంగా ఎవరిపై ద్వేషంతో లేను. నా దృష్టి మొత్తం సమాజాన్ని బాగు చేయడం మీదే ఉంది. బాధ్యత కలిగిన వ్యక్తులు సమాజంపై సానుకూల దృక్పథంతో ఉండాలి. అంతేతప్ప డబ్బు వస్తుందనే ఆశతో మోసపూరిత వ్యక్తుల సంస్థల తరఫున మాట్లాడకూడదు. ఇటువంటి యాప్స్ ను ప్రమోట్ చేసే వ్యక్తులు సమాజ ఉద్దారకులుగా ఎలా ఉంటారు? ఇటువంటి వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు. మీరు ప్రమోట్ చేసే యాప్స్ ను విశ్వసించ కూడదు. వారు చెప్పే మాటలను నమ్మి మోసపోకూడదని” సజ్జనార్ తన ట్వీట్లో పేర్కొన్నారు. సజ్జనార్ సన్నీ యాదవ్, హర్ష సాయి పై చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మరో వైపు హర్ష సాయి యూట్యూబ్లో వ్యక్తిగత విభాగంలో అత్యధిక ఫాలోవర్స్ ను కలిగి ఉన్నారు. పైగా పేదలకు అప్పుడప్పుడు డబ్బు సహాయం చేస్తుంటారు. ఇటీవల ఓ యువతిని మోసం చేశాడని హర్ష సాయి పై కేసు నమోదయింది.

     

    Also Read:   ‘పుష్ప 3’ విడుదల తేదీని ప్రకటించిన నిర్మాత..అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఇక పండగే!