కానీ లేటెస్ట్ గా ఆమె తన ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. నిన్న ఆమె దినచర్యకు సంబంధించిన ఫోటోలను ఒక 13 వరకు అప్లోడ్ చేసింది. వీటిలో ఒక ఫొటోలో ఆమె సెలైన్ బాటిల్ ని ఎక్కించుకుంటూ కనిపించింది. దీనిని చూసి ఆమె అభిమానులు మళ్లీ ఏమైంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బాగా గమనిస్తే సమంత ఇంకా మయోసిటిస్ వ్యాధి నుండి నూటికి నూరు శాతం కోలుకోలేదు. అందుకు తగిన ట్రీట్మెంట్ ఆమె ప్రతీరోజు తీసుకుంటూనే ఉంటుంది. కానీ బయటకు మాత్రం నవ్వుతూ కనిపిస్తూ పాజిటివ్ ఎనర్జీ ని నింపుతుంది. ఇంకెంత కాలం సమంత ఇలా మయోసిటిస్ ని ఎదురుకుంటూ ఉండాలి?, ఆమె సంపూర్ణంగా కోలుకునేది ఎప్పుడు? అంటూ సోషల్ మీడియా లో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం సమంత చేస్తున్న సినిమాలు కూడా తక్కువే, ఇంతకు ముందు లాగా ఆమె యాక్టీవ్ గా సినిమాలు చేయడం లేదు. రీసెంట్ గానే ఒక ‘ట్రలాలా’ అనే నిర్మాణ సంస్థని స్థాపించే, ఆమె ప్రధాన పాత్ర పోషిస్తూ ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రాన్ని ప్రకటించింది. ఈ సినిమాతో పాటు ఆమె కొత్త వాళ్ళను పెట్టి మరో సినిమాని కూడా పూర్తి చేసింది. ఈ చిత్రం ఇటీవలే పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా ఆమె పార్టీ ని కూడా ఏర్పాటు చేసింది. ఇదంతా పక్కన పెడితే గత ఏడాది ఈమె ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ తో మన ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ కి అనుకున్నంత స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు ఈమె మరోసారి నెట్ ఫ్లిక్స్ లో ‘రక్త బ్రహ్మాండ’ అనే వెబ్ సిరీస్ చేస్తుంది. ఈ సిరీస్ లో ఆమె మహారాణి పాత్ర పోషిస్తుంది.
Also Read: ‘పుష్ప 3’ విడుదల తేదీని ప్రకటించిన నిర్మాత..అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఇక పండగే!