https://oktelugu.com/

Pushpa 3: ‘పుష్ప 3’ విడుదల తేదీని ప్రకటించిన నిర్మాత..అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఇక పండగే!

Pushpa 3 'పుష్ప 2 ' క్లైమాక్స్ లో ఎవరో అల్లు అర్జున్ ని అతని కుటుంబ సభ్యులను మొత్తాన్ని బాంబు పెట్టి చంపేశాడు అన్నట్టుగా చూపిస్తారు. అంటే ఆ ప్రమాదం లో అల్లు అర్జున్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడా?, తన కుటుంబాన్ని మొత్తం చంపేసిన విలన్ పై పగతీర్చుకోవడమే సినిమానా?, మన చిన్నప్పటి కాలం నుండి చూస్తున్న స్టోరీలు ఇవి.

Written By: , Updated On : March 16, 2025 / 05:34 PM IST
Pushpa 3

Pushpa 3

Follow us on

Pushpa 3: ‘పుష్పరాజ్'(Pushparaj) దండయాత్ర అప్పుడే అయిపోయింది అనుకుంటే పొరపాటే. ఈ సిరీస్ ఇప్పట్లో ఆగేది కాదని నిర్మాత మరోసారి తేల్చి చెప్పేసాడు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే ఐకానిక్ రోల్స్ లో ఒకటి గా నిలిచిపోయింది పుష్ప(Pushpa). ఈ క్యారక్టర్ ప్రభావం చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు ప్రతీ ఒక్కరి పైన ఉంది. ఇలాంటి క్యారెక్టర్స్ ని అంత తేలికగా వదిలేయకూడదు. సిరీస్ గా కొనసాగిస్తూనే ఉండాలని అభిమానులతో పాటు ట్రేడ్ కూడా కోరుకుంటుంది. అందుకే ‘పుష్పరాజ్’ మేనియా ఇప్పట్లో ఆగదు అనేది బలంగా ఫిక్స్ అయిపోవాలి. ‘పుష్ప 2′(Pushpa 2 : The Rule) క్లైమాక్స్ లోనే ‘పుష్ప 3′(Pushpa 3 : The Rampage) ఉంటుందని చెప్పి ఫ్యాన్స్ కి ఆడియన్స్ కి షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు డైరెక్టర్ సుకుమార్(Director Sukumar). ఆడియన్స్ ఒక హై తో వెళ్లాలని చివర్లో కావాలని అలా పెట్టారు కానీ, ఈ సినిమా ఉండదు లే అని అందరూ అనుకున్నారు.

Also Read: కల్కి 2 పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన అమితాబ్… ప్రభాస్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్

కానీ నేడు ఆ చిత్ర నిర్మాత రవి శంకర్ ‘రాబిన్ హుడ్’ మూవీ ప్రొమోషన్స్ లో పాల్గొనగా, విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. ‘పుష్ప 3’ కచ్చితంగా ఉంటుందని, 2028 వ సంవత్సరం లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అల్లు అర్జున్(Icon Star Allu Arjun) చేతిలో అట్లీ సినిమాతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా కూడా ఉంది. ఈ రెండు చిత్రాలు పూర్తి అయ్యేలోపు కచ్చితంగా 2028 వ సంవత్సరం వచ్చేస్తుంది. ఈలోపు డైరెక్టర్ సుకుమార్ రామ్ చరణ్ తో చేయబోయే సినిమాని కూడా పూర్తి చేసేస్తాడు. అప్పుడు ఇద్దరు ఫ్రీ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కచ్చితంగా ఈ సినిమా కార్య రూపం దాల్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే ‘పుష్ప 3’ కి ‘పుష్ప 2’ కి ఉన్నంత క్రేజ్ ఉంటుందా?, ఎందుకంటే స్టోరీ ని సాగదీసినట్టు అవుతుందని విశ్లేషకుల అభిప్రాయం.

‘పుష్ప 2 ‘ క్లైమాక్స్ లో ఎవరో అల్లు అర్జున్ ని అతని కుటుంబ సభ్యులను మొత్తాన్ని బాంబు పెట్టి చంపేశాడు అన్నట్టుగా చూపిస్తారు. అంటే ఆ ప్రమాదం లో అల్లు అర్జున్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడా?, తన కుటుంబాన్ని మొత్తం చంపేసిన విలన్ పై పగతీర్చుకోవడమే సినిమానా?, మన చిన్నప్పటి కాలం నుండి చూస్తున్న స్టోరీలు ఇవి. ఈ చిత్రం పై ప్రత్యేకంగా అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఆసక్తి ఎలా కలుగుతుంది అనేదే ఇప్పుడు ప్రశ్న. ఇంతకు అల్లు అర్జున్ కుటుంబాన్ని బాంబు పెట్టి చంపిన ఆ వ్యక్తి ఎవరు. చేతులు బాగా కాలున్నాయి కాబట్టి భన్వర్ సింగ్ శిఖావత్ ఆ పని చేసి ఉంటాడా?, లేకపోతే కొత్త విలన్ ఈ సినిమాలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? అనేది ఒక్కటే ఆసక్తికరమైన విషయం అనొచ్చు. అంతకు మించి ఈ సినిమా విషయం లో అంచనాలు పెట్టుకునే అంశాలు ఏమి లేవు అనేది విశ్లేషకులు చెప్తున్న మాట.

 

Also Read: పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ రిలీజ్ కి మోక్షం దక్కేది అప్పుడేనా..?