Harsha Sai
Harsha Sai: ఏపీలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై పోలీసులు కేసులు పెడుతున్నారు. బెట్టింగ్ యాప్స్(Betting aaps)ను ప్రమోట్ చేసినవారిపై, ప్రభుత్వ విధానాలను తప్పు పట్టినవారిని, వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేసినవారిపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. విశాఖపట్నం(Vishakhapatnam)లో లోకల్ బాయ్ నానిని జైలుకు పంపగా, ఇప్పుడు హైదరాబాద్(Hyderabad)లో హర్ష సాయిపై కూడా కేసులు పెట్టారు.
Also Read: హీరోతో సమానంగా విజయశాంతి ఫైట్స్..’అర్జున్ S/O వైజయంతీ’ టీజర్ అదుర్స్!
బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినవారిని, తప్పుడు వార్తలను ఎంకరేజ్ చేసిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల(Social Media Influancers)పై ఆంధ్రప్రదేశ్ పోలీసులు వరుసగా కేసులు పెడుతున్నారు. కటకటాల వెనక్కు పంపుతున్నారు. ఈ క్రమంలో విశాఖ పోలీసులు లోకల్ బాయ్ నానిని అరెస్టు చేసి జైలుకు పంపించారు తాజాగా మరో ఇన్‌ఫ్లూయెన్సర్ హర్షసాయి(Harsha Sai)పైనా కేసు పెట్టారు. పేదలకు సాయం చేస్తున్నట్లు పబ్లిసిటీ చేసుకుని యూట్యూబర్(You tuber)గా ఫాలోయింగ్ సంపాదించిన హర్ష సాయి, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా భారీగా డబ్బు ఆర్జించినట్లు సమాచారం. తాను చేయకపోతే వేరే వాళ్లు చేస్తారని సమర్థించుకున్నాడు. అయితే, ఈ వ్యవహారంలో ఆయనపై పలువురు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. గతంలో ఓ సినిమా హీరోయిన్ ఫిర్యాదుతో అజ్ఞాతంలోకి వెళ్లిన హర్ష సాయి, బెయిల్(Bail) పొందిన తర్వాత బయటకు వచ్చాడు. ఇప్పుడు మళ్లీ పారిపోతాడా లేక లొంగిపోతాడా అన్నది చూడాలి. బయ్యా సన్నీ యాదవ్ అనే మరో యూట్యూబర్‌పై కూడా కేసులు నమోదయ్యాయి. ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు ఆయన్ని అరెస్టు చేస్తామని చెబుతున్నారు.
. @SajjanarVC Sir , @dgpapofficial sir కింది వీడియో చూడండి..వైసీపీ అధికార ప్రతినిధి @AreSyamala డబ్బులకు కక్కుర్తి పడి యువతను betting app’s వాడమని డబ్బు కోసం ఆశ పడి ప్రమోట్ చేస్తుంది.ఈమె పైన కేసు పెట్టీ ఊచలు లెక్కపెట్టేలా చూడండి.ఈమెకు పడే శిక్షను చూసి ఇంకెవరు అలా చేయకుండా చూడండి pic.twitter.com/NOnlcWNIpc
— AnchorShyamala(Parody) (@PaytmShyamala) March 16, 2025
జాబితాలో చాలా మంది..
బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీల జాబితాలో చాలా మంది ఉన్నారు. వీరిలో వైసీపీ అధికార ప్రతినిధిగా పేరొందిన శ్యామల(Shyamala) కూడా ఒకరు. ఆమె బెట్టింగ్ యాప్స్‌ను పెద్ద ఎత్తున ప్రమోట్ చేసి డబ్బు సంపాదించినట్లు తెలుస్తోంది. ఆమె వీడియోలు సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారాయి. అయితే, రాజకీయ అండ ఉన్నవారిపై చర్యలు తీసుకోవడం లేదని, అండ లేని వారిపైనే కేసులు పెడుతున్నారని ప్రశ్నలు వస్తున్నాయి. శ్యామల లాంటి వారు ఇలాంటి పనులు చేసినా పట్టించుకోరా అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
శ్యామలపైనా కేసు..
ప్రస్తుత పరిస్థితుల్లో శ్యామలపై కూడా కేసు నమోదు చేయక తప్పని స్థితి కనిపిస్తోంది. రాజకీయ ప్రమేయం లేని వారిపై తీసుకునే చర్యలు ఒక ఎత్తు అయితే, అధికార పార్టీలకు సంబంధం ఉన్నవారిని వదిలేస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ విషయంలో పోలీసుల తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read: IPL స్పెషల్ : ధోని, ప్రభాస్ వీడియో చూస్తే గూస్ బంప్స్!
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Harsha sai a case was registered against harsha sai and anchor shyamala was ignored
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com