Arjun Son Of Vyjayanthi Teaser: విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ అనుభూతిని ఇచ్చేందుకు తపన హీరోలలో ఒకరు నందమూరి కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram). చాలా కాలం తర్వాత ఆయన ‘బింభిసారా’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత వరుసగా ఆయన చేసిన ‘అమిగోస్’, ‘డెవిల్’ చిత్రాలు అట్టర్ ఫ్లాప్స్ గా మిగిలాయి. కళ్యాణ్ రామ్ కెరీర్ మొత్తం ఇలాగే కొనసాగింది. ఒక హిట్ పడితే వరుసగా నాలుగైదు ఫ్లాప్స్ రావాల్సిందే. అందుకే నందమూరి కుటుంబం నుండి వచ్చినప్పటికీ స్టార్ కాలేకపోయాడు, కేవలం మీడియం రేంజ్ కి మాత్రమే పరిమితం అయిపోయాడు. ఇకపోతే రీసెంట్ గా ఆయన ‘అర్జున్ S/O వైజయంతి'(Arun S/O Vyjayanthi)అనే సినిమా చేసాడు. ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించగా, సీనియర్ హీరోయిన్, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి(Vijayashanthi) ముఖ్య పాత్రలో నటించింది. కాసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలైంది.
Also Read: IPL స్పెషల్ : ధోని, ప్రభాస్ వీడియో చూస్తే గూస్ బంప్స్
ఈ టీజర్ చూసిన తర్వాత సినిమాలో కొత్తదనం పెద్దగా కనిపించలేదు కానీ, ఒక మంచి కమర్షియల్ సినిమా అని మాత్రం అర్థమైంది. ఇందులో విజయశాంతి ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా, కళ్యాణ్ రామ్ కి తల్లిగా నటించింది. అప్పట్లో విజయశాంతి కి లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ లాంటి పేర్లు ఎందుకొచ్చింది అంటే ఆమె స్టార్ హీరోలతో సమానంగా ఫైటింగ్స్ చేస్తుంది. ఆమె చేసే రియల్ స్తంట్స్ అప్పటి ఇండియా హీరోయిన్స్ లో ఎవ్వరూ చేసేవారు కాదు. అప్పుడేంటి ఇప్పుడు కూడా ఆమెకు పోటీ ఎవ్వరూ లేరు. ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి, ఆ చిత్రంలో తనలోని వింటేజ్ యాంగిల్ ని చూపించలేదు కానీ, ‘అర్జున్ S/O వైజయంతి’ లో మాత్రం తనలోని వింటేజ్ యాంగిల్ ని బయటకి తీసింది.
టీజర్ ప్రారంభంలోనే ఫైట్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వయస్సులో కూడా ఆమె అలాంటి ఫైట్స్ చేయడం అనేది మామూలు విషయం కాదు. కళ్యాణ్ కూడా ఈ చిత్రంలో మంచి ఇంటెన్స్ యాక్టింగ్ చేసినట్టుగా అనిపించింది. టీజర్ చూసిన తర్వాత అర్థమైన స్టోరీ ఏమిటంటే డ్యూటీ కోసం, తన కొడుకు కోసం ప్రాణాలిచ్చే పాత్రలో విజయశాంతి, తల్లి కోసం ఎంత దూరమైనా వెళ్లి పోరాటం చేసే పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నారని అర్థం అవుతుంది. తన కొడుకుని పోలీస్ అధికారిని చేయాలి అనే లక్ష్యంతో ఉన్న తల్లి కోరికని కొడుకు తీరుస్తాడా లేదా అనేది మెయిన్ ప్లాట్ గా అనిపించింది. ఓవరాల్ గా ఈ టీజర్ తో కళ్యాణ్ రామ్ మరోసారి మంచి కమర్షియల్ హిట్ ని అందుకోబోతున్నాడని స్పష్టంగా అర్థం అవుతుంది. కమర్షియల్ సినిమాలు చేసినప్పుడల్లా కళ్యాణ్ రామ్ హిట్స్ కొడుతూనే ఉన్నాడు. కాబట్టి ఈ సినిమా కూడా వర్కౌట్ అవ్వొచ్చని విల్శ్లేషకులు అంటున్నారు.