Homeట్రెండింగ్ న్యూస్Sankranti Haridas: నడకపోయి బైక్ వచ్చే.. ట్రెండ్ కు తగ్గట్టుగా మారిపోతున్న హరిదాసులు.. వైరల్ వీడియో*

Sankranti Haridas: నడకపోయి బైక్ వచ్చే.. ట్రెండ్ కు తగ్గట్టుగా మారిపోతున్న హరిదాసులు.. వైరల్ వీడియో*

Sankranti Haridas: సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. దీంతో ఏపీలో సంక్రాంతి వైబ్స్‌ మొదలవుతున్నాయి. గ్రామాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. భీమవరంలో కోడిపందేల సందడి పందెం రాయుళ్లు పందెం కోళ్లు సిద్ధం చేసుకుంటున్నారు. మూడ్రోజుల ముచ్చటైన ముగ్గుల పండగలో ‘హరిలో రంగ హరీ’ అంటూ చిడతలు వాయిస్తూ హరిదాసులు చేసే హడావిడి అంతా ఇంతాకాదు. అలాంటి హరిదాసులు కూడా అప్‌డేట్‌ అవుతున్నారు. ట్రెండ్‌ మార్చేస్తున్నారు. టెక్నాలజీకి అనుగుణంగా మారిపోతున్నారు. నయాగెటప్‌లో ఇప్పుడు దర్శనమిస్తున్నారు హరిదాసులు.

ట్రెండ్‌ సెట్‌చేస్తున్నారు..
తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో నిండైన వస్త్రధారణతో చేతిలో చిడతలు వాయిస్తూ హరినామ కీర్తనలు ఆలపిస్తూ తలపై అక్షయపాత్రను ధరించి ఏటా సంక్రాంతి మాసం ప్రారంభం ధనుర్మాసంలో వారు రావడం ఆనవాయితీగా వస్తోన్న సంప్రదాయం. అయితే, కాలంతోపాటు వచ్చిన మార్పులకు హరిదాసులు కూడా ట్రెండ్‌ మార్చారు. కాలినడకన వచ్చే హరిదాసులు ఇప్పుడు వెరైటీ వాహనాలను వాడుతూ ట్రెండ్‌ సెట్‌ చేస్తున్నారు. కోనసీమలోని పలు ప్రాంతాల్లో హరిదాసులు వెరైటీ వాహనాలపై తిరుగుతున్నారు.

చిడతలు పోయి.. టేపు రికార్డులు..
ఇక గ్రామాల్లోకి చిడతలు వాయిస్తూ, పాటలు పాడుతూ, హరినామ కీర్తనలు చేస్తూ వచ్చే హరిదాసులు ఇప్పుడు టేపురికార్డుల్లో పాటలు పెడుతూ కొత్త ట్రెండ్‌ సృష్టిస్తున్నారు. అయితే, నడిచి వెళ్లకుండా ఇలా ఎందుకు వెళ్తున్నారు అని అడిగితే వయస్సు మీద పడటంతో నడవలేకపోతున్నామని, ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ఈ సంప్రదాయాన్ని వదలలేక ఇలా తిరుగుతున్నామని హరిదాసులు చెపుతున్నారు.

బైక్‌ ముందు అక్షయపాత్ర..
ఇక తలపై పెట్టుకునే అక్షయ పాత్రను ప్రత్యేకంగా తీర్చిదిద్దిన బైక్‌ ముందుభాగంలో అమరుస్తున్నారు. వీధుల్లోకి భక్తిపాటలతో వాహనం రాగానే ఇళ్లలోని మహిళలు బయటకు వచ్చి.. బైక్‌ ముంద ఉన్న అక్షయపాత్రలో బియ్యం పోస్తున్నారు. ట్రెండ్‌కు తగ్గట్లు మారక తప్పడం లేదని కొంతమంది యువ హరిదాసులు పేర్కొంటున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version