Prashanth Neel: డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కే జి ఎఫ్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.ఈ సినిమాతో ఆయన తెలుగు హీరో లను కూడా బాగా ఆకర్షించాడు. ఇక ఇందులో భాగంగానే ఆయన ప్రభాస్ తో చేసిన సలార్ సినిమా ఈరోజు రిలీజ్ అయి పాజిటివ్ టాక్ సంపాదించడం తో తెలుగులో కూడా తన స్టార్ డం ని విస్తరిస్తున్నాడు. ఇక ఇప్పుడు ఆయన ఎన్టీఆర్ తో ఒక సినిమా అలాగే రామ్ చరణ్ తో మరొక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే ప్రశాంత్ నీల్ పైన కన్నడ అభిమానులు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.అవి ఏంటి అంటే కన్నడ సినిమాలో డైరెక్టర్ గా పరిచయమైన ప్రశాంత్ నీల్ అక్కడ సక్సెస్ లు సాధించి తెలుగు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నాడు అంటూ అతనిపైన తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు…
ప్రశాంత్ నీల్ కన్నడ ఇండస్ట్రీ ని ఎందుకు వదిలేసాడు అనేదని మీద రకరకాల ప్రశ్నలు కూడా ఇప్పుడు తలెత్తుతున్నయి. ప్రశాంత్ నీల్ కన్నడంలో ఉగ్రం సినిమాతో తన కెరియర్ ని స్టార్ట్ చేసాడు అది సక్సెస్ అవ్వడంతో ఆ తర్వాత ఆయన కెజీఎఫ్ తో పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ లు అందుకున్నాడు. ఇక ఇలాంటి టైం లో కన్నడ ఇండస్ట్రీలోనే ఉండకుండా ఆయన తెలుగు ఇండస్ట్రీకి రావడానికి గల ముఖ్య కారణాలేంటో ఆయనే ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు.. అదేంటంటే..
కన్నడ సినిమా ఇండస్ట్రీ తో పోలిస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా పెద్దది అలాగే ఇక్కడ ఉన్న హీరోలకు స్టార్డం కూడా చాలా ఎక్కువ కాబట్టి తెలుగు హీరోలు అయితే తన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ రేంజ్ లో చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీ ని ఎంచుకున్నట్టుగా ప్రశాంత్ నీల్ ఈ సందర్భంగా తెలియజేశారు.కానీ తను ఈ స్థాయి కి రావడానికి హెల్ప్ చేసిన కన్నడ సినిమా ఇండస్ట్రీ ని కూడా తను ఎప్పటికీ మర్చిపోలేనని ఆ కన్నడ ఇండస్ట్రీ వల్లే తను ఈరోజు ఇక్కడ ఈ స్థాయి లో ఉన్నాను అని కూడా చెప్పాడు…
అలాగే ఇక్కడ ఉన్న ప్రొడ్యూసర్లు భారీ మొత్తంలో సినిమా మీద ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారు కానీ కన్నడ ఇండస్ట్రీలో ఇంత భారీ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడానికి ప్రొడ్యూసర్లు ఎక్కువగా ముందుకు రారు కాబట్టి ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎంచుకున్నట్టుగా చెప్పాడు ఇక వరుసగా తెలుగులోనే సినిమాలు చేయడం పట్ల కన్నడ అభిమానులు వాళ్లు కూడా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఒక సినిమా కన్నడలో చేసి ఒక సినిమా తెలుగులో చేసుకోవచ్చు కదా అంటూ అక్కడ అభిమానులు అతనిని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నప్పటికీ ప్రశాంత్ నీల్ మాత్రం వాటిని పట్టించుకోకుండా ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే సెటిల్ అవుతున్నట్టుగా తెలుస్తుంది…
మెయిన్ గా ప్రశాంత్ నీల్ ఇక్కడికి రావడానికి గల కారణం ఇండియాలోనే ది బెస్ట్ హీరోలందరూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు అలాగే తెలుగు సినిమా హీరోతో సినిమా చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఈజీగా అందరికీ కన్వే అవుతుందనే ఒకే ఒక ఉద్దేశ్యం తో తను ఇండస్ట్రీకి వచ్చాడు అలాగే మిగతా ఇండస్ట్రీలతో పోల్చుకుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా ఎక్కువ మంది హీరోలు ఉన్నారు వాళ్ళతో ఎలాంటి జానర్ లలో అయిన సినిమాలు చేయవచ్చు ఇక దాన్ని కూడా పాయింట్ అవుట్ చేసుకొని తను ఇక్కడ హీరోలతో సినిమాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది…