Venkatesh : ఈ ఏడాది సంక్రాంతి సీజన్ విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) కి ఎంత అద్భుతంగా కలిసొచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అంత పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత, ఇక తన రేంజ్ కి తగ్గ సినిమాలు మాత్రమే చెయ్యాలని ఫిక్స్ అయ్యాడు వెంకటేష్. అందుకే త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) తో త్వరలోనే సినిమాని చేయబోతున్నాడు. త్రివిక్రమ్ మార్క్ ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనీ ఇప్పటి నుండే సన్నాహాలు చేస్తున్నారట. హారిక & హాసిని క్రియేషన్స్ పై చిత్రం నిర్మితం కానుంది.
Also Read : సంక్రాంతికి వస్తున్నాం ఎఫెక్ట్, స్టార్ డైరెక్టర్ తో వెంకటేష్ మూవీ కన్ఫర్మ్!
అయితే ఎన్నడూ ఊహించని క్లాష్ ఈ సంక్రాంతికి జరగబోతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్ లో త్వరలోనే ఒక సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. ఆయన ఉండేది కేవలం 5 నిమిషాల పాత్ర కాదు. కాస్త పెద్ద పాత్రనే ఉందట. ఆయనపై ఒక ఫైట్ సన్నివేశం, ఒక పాటని కూడా చిత్రీకరిస్తారట. ఫిలిం నగర్ లో ఈ వార్త తెగ ప్రచారం అవుతుంది. ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల అవ్వబోతుంది అంటూ ముహూర్తం రోజునే అధికారికంగా చెప్పేసారు. కాబట్టి వెంకటేష్ వెర్సస్ వెంకటేష్ వచ్చే సంక్రాంతికి ఉండబోతుందా అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అయితే త్రివిక్రమ్ తో సినిమా అంటే అంత ఆషామాషీ విషయం కాదు. కనీసం ఏడాది సమయమైనా పడుతుంది.
దానికి తోడు ఆయన గత చిత్రం ‘గుంటూరు కారం’ బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. కాబట్టి స్క్రిప్ట్ విషయం లో త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు ఈసారి ఉన్నాయి. కాబట్టి సమయం పట్టే అవకాశం ఉందని, సంక్రాంతికి ఈ చిత్రం వచ్చే అవకాశాలు లేవని అంటున్నారు. మరి ఎంత వరకు ఇది నిజం అవుతుందో చూడాలి. ఈ చిత్రం లో ఇతర నటీనటుల గురించి ఎలాంటి సమాచారం లేదు కానీ, చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ కి సంబంధించిన అప్డేట్ మాత్రం రీసెంట్ గానే ఒకటి వచ్చి బాగా వైరల్ అయ్యింది . ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. అందుకోసం ఆమె పది కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని కూడా అందుకుంటుందట. గతంలో ఆమె మెగాస్టార్ తో కలిసి ‘సైరా నరసింహా రెడ్డి’, ‘గాడ్ ఫాదర్’ చిత్రాలు చేసింది.
Also Read : రజినీకాంత్ చెప్పిన ఆ మాట కారణంగానే నా జీవితం మారిపోయింది : వెంకటేష్