https://oktelugu.com/

Hari Hara Veera Mallu- Power Glance: తొడగొట్టాడు.. తెలుగోడు.. హరిహర వీరమల్లుగా పవన్ విశ్వరూపం

Hari Hara Veera Mallu-Power Glance: తెలుగోడి సత్తా ఇది అంటూ ఒక చారిత్రక యోధుడి కథను తీసుకొని ‘హరిహర వీరమల్లు’గా వస్తున్నాడు పవన్ కళ్యాణ్.. గడిచిన వారం రోజులుగా ఊరిస్తున్న పవన్ కళ్యాణ్ కొత్త మూవీ పవర్ గ్లాన్స్ ను తాజాగా విడుదల చేశారు. కుస్తీ పోటీల్లో పవన్ కళ్యాణ్ మీసం మెలేసీ మల్లయోధులను మట్టి కరిపించిన వీరత్వాన్ని అద్భుతంగా చూపించారు. ఒక కోట.. అందులో జరుగుతున్న కుస్తీ పోటీలతో ఈ టీజర్ మొదలైంది. బరిలోకి […]

Written By:
  • NARESH
  • , Updated On : September 2, 2022 / 11:13 AM IST
    Follow us on

    Hari Hara Veera Mallu-Power Glance: తెలుగోడి సత్తా ఇది అంటూ ఒక చారిత్రక యోధుడి కథను తీసుకొని ‘హరిహర వీరమల్లు’గా వస్తున్నాడు పవన్ కళ్యాణ్.. గడిచిన వారం రోజులుగా ఊరిస్తున్న పవన్ కళ్యాణ్ కొత్త మూవీ పవర్ గ్లాన్స్ ను తాజాగా విడుదల చేశారు. కుస్తీ పోటీల్లో పవన్ కళ్యాణ్ మీసం మెలేసీ మల్లయోధులను మట్టి కరిపించిన వీరత్వాన్ని అద్భుతంగా చూపించారు. ఒక కోట.. అందులో జరుగుతున్న కుస్తీ పోటీలతో ఈ టీజర్ మొదలైంది.

    pawan kalyan

    బరిలోకి పిడుగు దిగివచ్చిదంటూ పవన్ కళ్యాణ్ కుస్తీ పోరాటాన్ని హైలెట్ గా చూపించారు. మల్లయోధులను మట్టి కరిపించి తొడగొట్టే తెలుగోడు అంటూ వీరమల్లు పాత్రను అద్భుతంగా తెరకెక్కించారు. తొలిసారి స్వాతంత్ర్య సమరయోధుడిగా ఒక చారిత్రక ‘హరిహర వీరమల్లు’ పాత్రలో పవన్ కళ్యాణ్ ఒదిగిపోయాడనే చెప్పొచ్చు..

    Also Read: Power Star Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు పవర్ స్టార్ బిరుదు ఇచ్చింది ఎవరో తెలుసా?

    చారిత్రక చిత్రంగా ‘హరిహర వీరమల్లు’ తెరకెక్కుతోంది. మొఘలాయిలు, కుతుబ్ షాషీల శకం నేపథ్యంలో సాగే కథ ఇది. చరిత్రకెక్కిన ఒక బందిపోటు వీరోచిత గాతగా దీన్ని రూపొందిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో దీన్ని విడుదల చేస్తున్నారు. ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్.

    pawan kalyan

    పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘హరిహర వీరమల్లు’ నుంచి ఒక ‘పవర్ గ్లాన్స్ ’ కొద్ది సేపటి క్రితమే విడుదలైంది. పవన్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న ఈ టీజర్ అంచనాలు అందుకునేలాగానే ఉంది. ఇదివరకే నిన్న రిలీజ్ చేసిన పోస్టర్ కు తగ్గట్టుగానే ఈ టీజర్ గూస్ బాంబ్స్ తెప్పిస్తోంది.

    పవన్ కళ్యాణ్ ఒక రథంపై శత్రువుల సంహారానికి వెళుతున్న యుద్ధ సన్నివేశాన్ని నిన్న క్రిష్ విడుదల చేశారు. ఈరోజు గ్లాన్స్ తో కుస్తీ పోటీలలో తలపడుతున్నట్టు చూపించారు.

    పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబరు 2ను ఈరోజు విడుదలైన ఈ పవర్ గ్లాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. #HariHaraVeeraMallu ట్రెండ్ అవుతోంది. అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చింది. ఇదిప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.

    Also Read:Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఆస్తులు, అప్పుల విలువ ఎంతో తెలుసా?