Aadhaar Card themed Ganesh pandal: దేశ వ్యాప్తంగా గణపతి నవరాత్రులు వేడుకగా జరుగుతున్నాయి. అంబరాలు మిన్నంటుతున్నాయి. సాధారణంగా వినాయక నవరాత్రులు వచ్చాయంటే ఆ సందడే వేరు. యువత పోటాపోటీగా మండపాలను ఏర్పాటుచేస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా, మారిన ప్రజల అభిరుచులకు దగ్గరగా మండపాలను ఏర్పాటుచేయాలని తహతహలాడుతుంటారు. అందరి కంటే భిన్నంగా ఆలోచించి.. మండపాలను ఏర్పాటుచేయాలని భావిస్తుంటారు. ఇటువంటి ఆలోచనే చేశారు ఝార్ఖండ్ లోని జెంషెడ్ పూర్ కు చెందిన యువకులు. వినూత్నంగా ముందుకు సాగాలని నిర్ణయించారు. పట్టణవాసులను తమ మండపం వైపు చూసేలా సరికొత్త ప్రయోగం చేశారు. అదే ఆధార్ కార్డు మాదిరిగా మండపాన్ని తయారుచేయాలనుకున్నారు. దాంతోనే సరిపెట్టకోకుండా వినాయకుడికే ఆధార్ సృష్టించారు. అతడి చిరునామాను కూడా పొందుపరిచారు. బార్ కోడ్ లో ఆయన తో పాటు కుటుంబసభ్యుల వివరాలను, విశిష్టతను తెలిపేలా అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో ఆ మండపానికి భక్తులు క్యూ కడుతున్నారు. వినూత్నంగా రూపొందించిన మండపంతో పాటు గణేష్: విగ్రహం, ఆయన పేరిట రూపొందించిన ఆధార్ కార్డు వద్ద సెల్ఫీలు దిగుతున్నారు. ఇప్పుడు ఆ మందిరం, యువకుల వినూత్న ఆలోచన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

వినూత్న ఆలోచన..
ప్రజల జీవితంలో ఆధార్ ఒక భాగమైంది. తప్పనిసరిగా మారిపోయింది. దైనందిన జీవితంలో ప్రతీ అవసరంలో ఆధార్ ఉండి తీరాల్సి వస్తోంది. అందుకే ఆధార్ మాదిరిగా మండపాన్ని రూపొందిస్తేనే ప్రజలకు చేరువ కావచ్చని నిర్వాహకులు ఆలోచన చేశారు. ఆధార్ ఒక్క మనిషికేనా? దేవుడికి సృష్టిస్తే ఎలా ఉంటుంది? అన్న కోణంలో ఆలోచించారు. ఇందుకు వినాయక ఉత్సవాలను వేదికగా చేసుకున్నారు. ఆధార్ నమూనాతో భారీ ఎత్తున మండపం ఏర్పాటుచేశారు. గణేషుడి పేరుతో ఆధార్ కార్డును సృష్టించేశారు. ఆధార్ కార్డు థీమ్ తో ఏర్పాటుచేసిన ఈ ప్రత్యేక మండపం జెంషెడ్ పూర్ లోనే కాకుండా అటు జార్కండ్ తో పాటు దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందడంతో ఆ యువకులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.
Also Read: Hari Hara Veera Mallu- Power Glance: తొడగొట్టాడు.. తెలుగోడు.. హరిహర వీరమల్లుగా పవన్ విశ్వరూపం

విభిన్నంగా చిరుమానా..
ఆధార్ కార్డులో గణేషుడి చిరునామా ఆసక్తిగా పొందుపరిచారు. వినాయకుడి అడ్రస్ ను కైలాసంగా పేర్కొన్నారు. ఫొటో స్థానంలో భారీ గణేష్ బొమ్మను పేస్ట్ చేశారు. ఆధార్ కార్డుపై ఉన్న బార్ కోడ్ ను స్కాన్ చేస్తే..అది గుగూల్ లింక్ కు వెళ్లేలాగా ఏర్పాట్లు చేశారు.అందులో వినాయకుడి ఫోటోలు ప్రత్యక్షమవుతాయి. అలాగే మండప ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఆధార్ పై శ్రీ గణేష్ సన్ ఆఫ్ మహాదేవ్, కైలాస్ పర్వత శిఖరం, మానస సరోవరం సరస్సు దగ్గర, పిన్ కోడ్ 000001 అని రాసి ఉంది. ఇక డేట్ ఆఫ్ బర్త్ 01.01.600సీఈ పేర్కొన్నారు. మొత్తానికైతే ఆ యువకుల వినూత్న ఆలోచన ఇంటా బయట ప్రశంసలు అందుకుంటోంది. అక్కడకు వచ్చి పోయే భక్తులు విగ్రహం, ఆధార్ కార్డు వద్ద ముచ్చట పడి సెల్ఫీలు దిగుతున్నారు. ప్రతిరోజూ వేలాది మంది దర్శించుకుంటున్నారు. అటు దేశవ్యాప్తంగా సోషల్ మీడియా తెగ వైరల్ అవుతున్నాయి అక్కడి దృశ్యాలు.
[…] […]