Guntur Kaaram Theatrical Trailer : మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న గుంటూరు కారం సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ మొత్తం ట్రైలర్ లోనే ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ట్రైలర్ మీద కొంతమంది బాగుందని అంటే మరి కొంతమంది మాత్రం అంత గొప్పగా లేదని వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. కమర్షియల్ హంగులతో ట్రైలర్ ని రూపొందించారు అయినప్పటికీ ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ ని కూడా చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు.
మరి ఈ సినిమా ఏ మేరకు విజయం సాధిస్తుంది అనేది తెలియాల్సి ఉంది. ఇక జనవరి 12వ తేదీన ఈ సినిమా మన ముందుకు రాబోతుంది. దాంతో ఈ ట్రైలర్ ఈ సినిమా మీద అంచనాలు పెంచేసిందనే చెప్పాలి. ఈ దెబ్బతో సంక్రాంతి విన్నర్ మహేష్ బాబు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకుముందు త్రివిక్రమ్ ఎలాంటి స్టైల్ అయితే ఫాలో అయ్యేవాడో ఈ సినిమా కోసం కూడా అలాంటి స్టైల్ నే ఫాలో అయ్యాడు. అయినప్పటికీ ఈ సినిమాలో మహేష్ బాబు ఎనర్జీ బాగా వాడుకున్నట్టుగా తెలుస్తుంది.
ఒక సంక్రాంతి విన్నర్ ఈ సినిమానే అనేది ఆల్మోస్ట్ స్పష్టం అవుతుంది. మరి ఈ సినిమాతో త్రివిక్రమ్ మహేష్ బాబు కి తిరుగులేని హిట్ ఇస్తాను ఆని చెప్పిన త్రివిక్రమ్ ఎంత మేరకు తన మాట నిలబెట్టుకుంటారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే ఇంతకుముందు త్రివిక్రమ్ చేసిన సినిమాల ఛాయలు ఈ సినిమా ట్రెయిలర్ లో పెద్దగా కనిపించనప్పటికీ మొత్తానికి అయితే ఈ సినిమా ఏదో ఒకటి క్రియేట్ చేయబోతుందనేది మాత్రం స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక మొన్నటిదాకా ఈ సినిమా కీర్తి కిరీటాలు అనే నవలకి కాపీ గా చేస్తున్నారు అనే టాకైతే వచ్చింది.
మరి అది ఎంతవరకు నిజమనేది తెలియాలంటే ఈ సినిమాని చూస్తే తప్ప ట్రైలర్ లో అంత చెప్పలేము ఎందుకంటే ట్రైలర్ లో పెద్దగా తెలియడం. సినిమా చూస్తే మాత్రం ఇది ఆ నవలకి కాపీ గా వచ్చిందా లేదంటే ఒరిజినల్ స్టోరీ తోనే వచ్చిందా అనేది మాత్రం పక్కగా తెలిసిపోతుంది. ఇక జనవరి 12వ తేదీన బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ని వినిపించడానికి ఈ సినిమా రెడీ అవుతున్నట్టుగా మహేష్ బాబు అభిమానులు ఇప్పటికే పండగ చేసుకుంటున్నారు…
