https://oktelugu.com/

Guntur Constable: వేరే యువతితో కానిస్టేబుల్ రాసలీలలు.. అదను చూసి భార్య ఏం చేసిందంటే?

గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కట్టి శ్రీను అనే కానిస్టేబుల్ పనిచేసేవాడు. ప్రస్తుతం ఆయన స్పెషల్ టాస్క్ ఫోర్స్ లో కొనసాగుతున్నారు. ఈయనకు పల్నాడు జిల్లా నాదెండ్లకు చెందిన దివ్యతో వివాహం జరిగింది.

Written By:
  • Dharma
  • , Updated On : October 20, 2023 / 12:04 PM IST

    Guntur Constable

    Follow us on

    Guntur Constable: ఆయన ఓ బాధ్యతాయుతమైన పోలీస్ కానిస్టేబుల్. కానీ తన స్థాయిని మరిచి ఓ యువతి తో రాసలీలలు జరుపుతున్నాడు. ఆమె మత్తులో పడి భార్య, బిడ్డను నిర్లక్ష్యం చేస్తున్నాడు. భార్య పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో భర్త ఆ యువతీతో రాసలీలల్లో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. గుంటూరు జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

    గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కట్టి శ్రీను అనే కానిస్టేబుల్ పనిచేసేవాడు. ప్రస్తుతం ఆయన స్పెషల్ టాస్క్ ఫోర్స్ లో కొనసాగుతున్నారు. ఈయనకు పల్నాడు జిల్లా నాదెండ్లకు చెందిన దివ్యతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం శ్రీను కుటుంబంతో కలిసి నాదేండ్లలో నివాసం ఉంటున్నాడు. తరచూ కోర్టు పనులపై వచ్చిన సమయంలో శ్రీనుకు దాచేపల్లి కి చెందిన యువతీతో పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం ఆమె గుంటూరులో ఉంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతోంది. ఈ తరుణంలో వీరి మధ్య స్నేహం వివాహేతర సంబంధానికి దారి తీసింది.

    అయితే శ్రీను ప్రవర్తనలో మార్పు వచ్చింది. దీనిని గమనించిన భార్య దివ్య ఆరా తీయడం ప్రారంభించింది. భర్త మరో మహిళతో ఉండడాన్ని తెలుసుకొని షాక్ కి గురైంది. శ్రీను సదరు యువతీతో అమరావతి రోడ్డు ఐడి ఆసుపత్రి ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. దీనిపై పలుమార్లు భర్తనిదివ్య హెచ్చరించింది. జిల్లా ఎస్పీకి సైతం ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు శాఖ పరంగా ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు.దీంతో గురువారం కుటుంబ సభ్యులతో కలిసి శీను యువతి తో కలిసి ఉంటున్న అపార్ట్మెంట్ వద్దకు చేరుకొంది. దివ్య వచ్చిన విషయం తెలుసుకున్న శ్రీను ఎంతసేపటికి తలుపు తీయలేదు. విషయం తెలుసుకున్న నల్లపాడు పోలీసులు వచ్చి తలుపులు తీయించారు. బయటకు వచ్చిన శ్రీనును భార్య దివ్య నిలదీసింది. ఆయన మెట్లు దిగుతున్న క్రమంలో కుటుంబ సభ్యులు చుట్టుముట్టారు. ఈ పెనుగులాటలో శ్రీను చొక్కా చిరిగిపోయింది. పోలీసులు వారందరిని స్టేషన్కు తీసుకెళ్లారు. ఇరువర్గాలకు చెందిన పెద్దలతో పంచాయతీ చేశారు. రాజీ ప్రయత్నాలు ప్రారంభించారు. కానిస్టేబుల్ పై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని సీఐ బత్తుల శ్రీనివాసరావు తెలిపారు.