Woman to Marry Herself: పెళ్లంటే నూరేళ్ల పంట.. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడాయి అని అంటారు. అయితే స్వర్గంలో అమ్మాయి, అబ్బాయికే పెళ్లి నిశ్చయం అవుతుందా? లేక అమ్మాయి అమ్మాయికి, అబ్బాయి, అబ్బాయికి.. తనతో తనకు పెళ్లి ముందే నిశ్చయం అవుతుందా అనేసందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు కారణం ఇటీవల జరుగుతున్న పెళ్లిళ్లే. ఇటీవల అమ్మాయి, అమ్మాయిని.. అబ్బాయి అబ్బాయిని పెళ్లి చేసుకోవడం చూస్తున్నాం. జెండర్ ఏదైనా ఒకరికి ఒకరు తోడుగా ఉండటం కామన్ అయిపోయింది. అయితే ఇక్కడ ప్రస్తావించే పెళ్లి మాత్రం వీటన్నింటికి చాలా భిన్నం.. ప్రత్యేకం కూడా! ఓ యువతి తనకు వేరేకొరి తోడు లేకుండానే పెళ్లి చేసుకోబోతుంది. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా మీరు చదివింది నిజమే. గుజరాత్‌కు చెందిన ఓ యువతి తనను తానే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది.

స్వీయ పరిణయం..
గుజరాత్ రాష్ట్రంలోని వడోదరకు చెందిన 24 ఏళ్ల క్షమాబిందు స్వీయ పరిణాయమడనుంది. అయితే సాధారణ పెళ్లి లాగే అన్ని వేడకలను నిర్వహించాలనుకుంది. జూన్ 11న అన్ని ఆర్భాటాలతో పెళ్లి చేసుకోబోతుంది. ఒక్క వరుడు, బరాత్ తప్ప అన్నీ సంప్రదాయబద్ధంగా జరుపుకోనుంది. తన పెళ్లి గురించి క్షమా మాట్లాడుతూ.. తానెప్పుడూ పెళ్లి చేసుకోవాలనుకోవాలనుకోలేదని పేర్కొంది. అయితే పెళ్లికూతురుగా మాత్రం తయారు కావాలని అనుకున్నానని, అందుకే తనను తాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ‘స్వీయ వివాహం అనేది మనకోసం మనం నిలబడాలనే నిబద్ధత.. నీపై నువ్వు ప్రేమను చూపించడం. కొందరు ఎవరినైనా ప్రేమిస్తే వారిని పెళ్లి చేసుకుంటారు.
Also Read: Mahesh Babu- Rajamouli: రాజమౌళి మూవీ జోనర్ ఏంటి? మొదటిసారి నోరు విప్పిన మహేష్!
కానీ నన్ను నేను ప్రేమిస్తున్నాను. అందుకే స్వీయ వివాహం చేసుకుంటున్నాను. అంతేకాదు, ఇంతకు ముందు దేశంలో ఎవరైనా ఇలా చేశారా? అని ఆన్లైన్ లో వెతికినా వివరాలు రాలేదు. బహుశా నేనే మొదటి వ్యక్తిని కావచ్చు. ఇలాంటి వివాహం అసందర్భమైందని అంటుంటారు కానీ, సమాజానికి స్త్రీలు ముఖ్యమని తెలియజేయడానికే ఈ ప్రయత్నం చేస్తున్నాను’ అని తెలిపింది.

తల్లిదండ్రుల అంగీకారంతోనే.
ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న క్షమాబిందు గోత్రిలోని ఓ గుడిలో పెళ్లి చేసుకోనున్నట్లు తెలిపింది. తన పెళ్లికి తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నట్లు వెల్లడించింది. ఇవన్నీ కాదు కానీ పెళ్లి తర్వాత హనీమూ కూడా వెళ్లనుందట ఈ పెళ్లికూతురు.. సోలోగా రెండు వారాలు గోవాకు వెళ్తున్నట్లు పేర్కొంది. అయితే ఇలాంటి వివాహం జరగడం గుజరాత్‌లోనే కాదు దేశంలోనే మొదటిసారి. ప్రస్తుతం ఈ పెళ్లి విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
[…] Also Read:Woman to Marry Herself: ఆమె పెళ్లి ఆమెతోనే!!.. దేశంలోన… […]