Chiranjeevi and Venky Kudumula: ఆచార్య దెబ్బకు చిరంజీవి మైండ్ సెట్ మారిందని, దర్శకుడు వెంకీ కుడుములతో చేయాల్సిన మూవీ పక్కన పెట్టారనే టాక్ వినిపించింది. దీనిపై వరుస కథనాలు వెలువడ్డాయి. సదరు వార్తలపై చిరంజీవితో పాటు దర్శకుడు వెంకీ కుడుముల స్పందించలేదు. దీంతో ప్రాజెక్ట్ నిజంగానే ఆగిపోయి ఉంటుందని అందరూ భావించారు. ఈ పుకార్లకు, ఊహాగానాలకు తాజాగా దర్శకుడు వెంకీ కుడుముల చెక్ పెట్టారు. చిరంజీవి గారితో మూవీ చేస్తున్నట్లు వెల్లడించారు. కమల్ హాసన్ లేటెస్ట్ మూవీ విక్రమ్. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కమల్ హాసన్ ని వెంకీ కుడుములు ఇంటర్వ్యూ చేశారు.

ఈ ఇంటరాక్షన్ లో లోకేష్ కనకరాజ్ మీకు పెద్ద ఫ్యాన్ అంట. ఒక అభిమానిగా వెండితెరపై ఆయన్ని మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్ లో ప్రెజెంట్ చేసి ఉంటారనే నమ్మకం ఉందన్నారు. నేను చిరంజీవికి పెద్ద అభిమానిని ఆయనతో మూవీ చేస్తున్నాను, అని మాటల్లో మాటగా చెప్పుకొచ్చాడు. వెంకీ కుడుములు కామెంట్ తో చిరు ప్రాజెక్ట్ కోల్పోయాడన్న పుకార్లకు చెక్ పడింది. ఇక అది సరిపోదు దర్శకుడిగా చిరంజీవిని ఇతర దర్శకులు ఎలా చూపించారో గుర్తించి, భిన్నంగా ప్రజెంట్ చేయమని కమల్ వెంకీ కుడుములకు సలహా ఇచ్చాడు.
Also Read: Mahesh Babu- Rajamouli: రాజమౌళి మూవీ జోనర్ ఏంటి? మొదటిసారి నోరు విప్పిన మహేష్!
వెంకీ కుడుముల తెరకెక్కించిన భీష్మ స్పెషల్ షో చూసిన చిరంజీవి ఇంప్రెస్ అయ్యాడు. సినిమా చేద్దామని వెంకీకి హామీ ఇచ్చాడు. అనంతరం చిరు కోసం వెంకీ కుడుముల కథ సిద్ధం చేయడం, ఆయన ఓకే చేయడం చకచకా జరిగిపోయాయి. వెంకీ కుడుముల ట్రాక్ సైతం బాగుంది. ఆయన డెబ్యూ చిత్రం ఛలో, రెండవ చిత్రం భీష్మ సూపర్ హిట్స్ అందుకున్నాయి. చిరంజీవి వెంకీకి అవకాశం ఇవ్వడం వెనుక ఇది కూడా ఓ కారణం.

ఇక విదేశాలకు విహారానికి వెళ్లిన చిరంజీవి తిరిగొచ్చారు. వెంటనే ఆయన గాడ్ ఫాదర్, భోళా శంకర్, చిరు 154 చిత్రాల షూటింగ్స్ లో పాల్గొననున్నారు. ఆచార్య భారీ షాక్ ఇచ్చిన నేపథ్యంలో గ్రేట్ కమ్ బ్యాక్ ఇవ్వాలని చిరంజీవి ఆశిస్తున్నారు. ఆచార్య భారీగా నష్టాలు తెచ్చిపెట్టింది. డిస్ట్రిబ్యూటర్స్ కి డబ్బులు తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మూడు చిత్రాలు ఏక కాలంలో చిరంజీవి పూర్తి చేస్తున్నారు. మెహర్ రమేష్, మోహన్ రాజా, బాబీ దర్శకులుగా ఉన్నారు. ఇక వెంకీ కుడుముల చిత్రం ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ పైకి వెళ్లే సూచనలు కలవు. వెంకీ చేస్తున్న ఫస్ట్ స్టార్ హీరో చిరంజీవి కాగా.. ఏ రేంజ్ హిట్ ఇస్తాడో చూడాలి.
Also Read:Aadhi Pinisetty: హాట్ టాపిక్ గా నటుడు ఆది వరకట్నం… అన్ని కోట్లు తీసుకున్నాడా!
[…] […]