Bandi Sanjay: ప్రజాస్వామ్యమా? నిరంకుశ నాదమా? ప్రశ్నించిన పాపానికి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? అమాయకులపై దారుణంగా దాడి చేస్తారా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా పెరుమాండ్ల నగర్ కు చెందిన రైతులు తమ భూములు లాక్కోవద్దంటూ శాంతియుతంగా నిరసన చేసిన రైతులు శ్రీనివాస్, నిరంజన్, మురళి అనే ముగ్గురు రైతులపై పోలీసులు అర్థరాత్రి ఇంటి గోడ దూకి కిడ్నాప్ చేసి ఎన్ కౌంటర్ చేస్తామని బెదిరించడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలనకు తార్కాణమీ సంఘటన అని అభిప్రాయపడ్డారు. నిరంతరం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న సర్కారు తీరుపై మండిపడుతున్నారు.

బీజేపీ రైతులకు అండగా నిలుస్తంది. రైతుల పక్షాన పోరాటం చేస్తుంది. వారి సంక్షేమానికి చర్యలు తీసుకుంటాం. రాక్షసుల్లా ప్రవర్తించిన పోలీసులను చట్టపరంగా శిక్షించాలి. అమాయక రైతులు మావోయిస్టులా? తీవ్రవాదులా? దేశానికి కీడు చేసే వారా? వారిని ఎందుకు అరెస్టు చేశారు? వారిపై ఎందుకు దాడికి పాల్పడ్డారు? సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకునేదాకా పోరాడతామని చెబుతున్నారు. వారిని హింసించి విచక్షణారహితంగా దాడి చేయడంపై ఎవరి హస్తం ఉందని ప్రశ్నిస్తున్నారు. వారు చేసిన నేరమేమిటో చెప్పాలని అడుగుతున్నారు.
Also Read: Anna Hazare- KCR: కేసీఆర్ సంచలనం అదేనా?… విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి అన్నాహజారే!!
ల్యాండ్ ఫూలింగ్ పేరుతో భూములు లాక్కునేందుకు ప్రయత్నించడం ఏమిటో చెప్పాలి. దీన్ని బీజేపీ ఖండిస్తోంది. రైతుల పకషాన నిలుస్తోంది. వారికి న్యాయం జరిగే వరకు పోరాడతాం. రాష్ట్రంలో న్యాయం బతికుందా? టీఆర్ఎస్ చేతిలో బందీ అయిందా? న్యాయపరంగా ఆందోళన చేసిన రైతులను రాక్షసంగా పీడించడం ఎంతవరకు సమంజసం. సంబంధిత పోలీసు అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకునే వరకు ఊరుకునేదిత లేదు. ఉద్యమిస్తాం. వారికి న్యాయం చేసే వరకు విశ్రమించం.

అధికార పార్టీ తీరు ఆక్షేపణీయం. అమాయకులపై దాడి చేయడం దారుణం. విచక్షణారహితంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి వారిని బాధలకు గురిచేయడం బాధాకరం. వారేమైనా బ్యాంకు దోపిడీ చేశారా? ఇంత దారుణంగా హింసించడంపై ఆందోళన చెందారు. అధికార పార్టీకి రోజులు దగ్గర పడ్డాయి. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస మట్టి కరవడం ఖాయం. అమాయకులపై దాడులు చేస్తే ఊరుకోం. న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తాం. వారి పక్షాన నిలిచి పోరాడతాం.
ఈ ఘాతుకానికి పాల్పడిన సీఐ విశ్వేశ్వర్ రెడ్డి, ఎస్ఐ భరత్ లను సస్పెండ్ చేయాలి. బాధితులకు న్యాయం చేయాలి. ప్రభుత్వం ఇలాగే దాడులు చేయిస్తుంటే ఎవరు ఊరుకోరు. ఎదురు తిరిగి ప్రశ్నించి ప్రభుత్వ దమనకాండను నిలదీస్తాం. ఇప్పటికే జిల్లా బీజేపీ నాయకుల బృందం పర్యటించి పరామర్శించగా రాష్ట్ర శాఖ తరఫున బండి సంజయ్ బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. బాధ్యులైపై చర్యలు తీసుకునే వరకు ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రజలకు న్యాయం చేసేంత వరకు విశ్రమించమని చెప్పారు.
[…] Also Read: Bandi Sanjay: అమాయక రైతులపై అమానుష దాడులా? ప్ర… […]
[…] Also Read: Bandi Sanjay: అమాయక రైతులపై అమానుష దాడులా? ప్ర… […]