https://oktelugu.com/

Viral Video : అందరూ చూస్తుండగానే పెళ్లికూతురిని కింద పడేశాడు.. వైరల్ వీడియో

లైక్స్, కామెంట్ల కోసం ఇలాంటి పని చేయాలా అంటూ నూతన వధూవరులపై విమర్శల వర్షం కురుస్తోంది. ఒకప్పుడు పెళ్లి వేడుకలు ఘనంగా జరిగేవి. ఇప్పుడు లైక్స్, కామెంట్స్ చుట్టూ తిరుగుతున్నాయి. ఇంతలో ఎంత మార్పు.

Written By:
  • NARESH
  • , Updated On : February 19, 2024 / 02:45 PM IST
    Follow us on

    Viral Video : పెళ్లి వేదిక మొత్తం హడావిడిగా ఉంది. బంధువుల రాకతో సందడిగా ఉంది. ఫంక్షన్ హాల్ ను కూడా అందంగా ముస్తాబు చేశారు. వేదిక మీద వధూవరులు కూర్చున్నారు. బంధువులు అక్షింతలు వేస్తుండగా వారి దీవెనలు స్వీకరిస్తున్నారు. ఈలోగా ఏం జరిగిందో తెలియదు గానీ ఒక్కసారిగా పెళ్లికూతురు కింద పడింది. దీంతో పెళ్లి వేడుకలో ఒక్కసారిగా నిశ్శబ్దం.. కుటుంబ సభ్యుల్లో మౌనం.. ఇంతకీ ఏం జరిగిందంటే..

    సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత రోజుకు కొన్ని వందల వీడియోలు సర్కులేట్ అవుతున్నాయి. అలా ఒక వీడియో సోషల్ మీడియాను షేర్ చేస్తోంది. ఆ ప్రాంతం ఎక్కడో తెలియదు గాని.. ఓ పెళ్లి వేడుకలో పెళ్లి కుమారుడు హఠాత్తుగా పెళ్లి కుమార్తెను కిందకు తోసేసాడు. దీంతో ఆమె ఒక్కసారిగా కింద పడింది. కిందపడిన ఆ పెళ్లికూతుర్ని కనీసం లేపేందుకు పెళ్ళికొడుకు ప్రయత్నించలేదు. ఈ లోగా కొంతమంది వచ్చి ఆమెను లేపారు. ఆ తర్వాత పెళ్లి వేదిక వద్దకు తీసుకెళ్లారు. అయినప్పటికీ ఆ పెళ్ళికొడుకు అలానే ఆగ్రహంతో ఉన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ అక్కడ ఏం జరిగి ఉంటుంది అనేది ఎవరూ చెప్పడం లేదు. దాంపత్య జీవనాన్ని ప్రారంభించక ముందే పెళ్లికూతురును పెళ్ళికొడుకు అలా చేయడం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు.

    అయితే సోషల్ మీడియాలో లైక్స్, కామెంట్స్ కోసం ఆ పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు అలా చేసి ఉంటారని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. దాంపత్య జీవితాన్ని ప్రారంభించక ముందే వారిద్దరి మధ్య గొడవలు ఏముంటాయని వారు అంటున్నారు. సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ఓవర్ నైట్ లో స్టార్లు కావాలని చాలామంది భావిస్తున్నారని.. అందుకు ఇలాంటి అడ్డమైన పనులు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ లైక్స్, కామెంట్ల కోసం ఇలాంటి పని చేయాలా అంటూ నూతన వధూవరులపై విమర్శల వర్షం కురుస్తోంది. ఒకప్పుడు పెళ్లి వేడుకలు ఘనంగా జరిగేవి. ఇప్పుడు లైక్స్, కామెంట్స్ చుట్టూ తిరుగుతున్నాయి. ఇంతలో ఎంత మార్పు.