https://oktelugu.com/

Tollywood: ఈ స్టార్లకు జరిగిన అవమానాల గురించి తెలిస్తే కచ్చితంగా బాధ పడతారు?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ కూడా ఒకానొక సమయంలో అవమానాలను ఎదుర్కొన్నారట. కెరీర్ మొదట్లో నేను హీరో అవుతాను అనడంతో ముఖం మీద అన్ని మచ్చలు వేసుకుని నువ్వు హీరో అవుతావా...

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : February 19, 2024 / 02:38 PM IST
    Follow us on

    Tollywood: పండ్లున్న చెట్టుకే దెబ్బలు అంటారు. ముల్లులు ఉన్న గులాబీ అందంగా ఉంటుంది. కష్ట పడితే గానీ ఫలితం దక్కదు అంటూ మంచి మాటలు చెబుతారు పెద్దలు. ఇవి అక్షర సత్యాలు అని కొందరి లైఫ్ లను చూస్తుంటే అర్థం అవుతుంటుంది. ఇక సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి ఎక్కువ జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు స్టార్ పొజిషన్ లో ఉన్న చాలా మంది హీరో హీరోయిన్లు ఒకప్పుడు అవమానాలు, కష్టాలను ఎదుర్కొన్న వారే మరి మన స్టార్లు అవమానానికి గురై ఇప్పుడు స్టార్ స్టేటస్ ను పొందినది ఎవరు ఓ సారి లుక్ వేయండి.

    ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ కూడా ఒకానొక సమయంలో అవమానాలను ఎదుర్కొన్నారట. కెరీర్ మొదట్లో నేను హీరో అవుతాను అనడంతో ముఖం మీద అన్ని మచ్చలు వేసుకుని నువ్వు హీరో అవుతావా అంటూ హేళన చేశారట చాలా మంది. కానీ ఇప్పుడు డీజే టిల్లు సినిమాతో ఎవరూ ఊహించని విధంగా పాపులారిటీని సంపాదించారు సిద్దు. ఇదే తరహాలో నటుడు ఉపేంద్ర కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నప్పుడు ఒకసారి భోజనం చేయడానికి వెళ్లగా అక్కడ అవమానం ఎదుర్కొన్నారట.

    అన్నం వడ్డిస్తున్న ఓ ప్రొడక్షన్ బాయ్ అన్నం లేదు ఏం లేదు పోరా అంటూ చాలా ఇన్సల్ట్ చేస్తూ కసురుకుని మాట్లాడారట. దీంతో ఆయన చాలా బాధ పడ్డారట. ఇక అడవి శేష్ గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నటుడు కూడా అవమానాల పాలయ్యారట. ఈయనను ఒకసినిమా కోసం సంప్రదించారట మేకర్స్. అయితే రెండు మూడు రోజులు షూటింగ్ అయిన తర్వాత అవసరం లేదు వెళ్ళిపో అన్నారట. సినిమా అయిపోయింది వెళ్లిపో అన్నారట. అంటే ఇది కేవలం గెస్ట్ రోల్ మాత్రమే హీరో రోల్ కాదని అర్థం చేసుకున్నారట.

    అలాగే హీరోయిన్ నయనతార ఒకసారి అవార్డు తీసుకోవడానికి వేదికపైకి వెళ్లినప్పుడు పక్కనే అల్లు అర్జున్ కూడా ఉన్నారట. కానీ ఆ అవార్డు భర్త చేతుల మీదుగా తీసుకోవడం ఇష్టం అని చెప్పడంతో ఆ అవమానాన్ని నవ్వుతూనే స్వీకరించారు అల్లు అర్జున్. ఇలా ఈ స్టార్లు ఒకానొక సందర్భంలో అవమానాల పాలయ్యారు.