Homeట్రెండింగ్ న్యూస్Gold that grows on the earth: ఇది భూమి పై పండే బంగారం.. వందల్లో...

Gold that grows on the earth: ఇది భూమి పై పండే బంగారం.. వందల్లో ఖర్చు.. ఎకరానికి మూడు కోట్ల ఆదాయం.. ఇంతకీ ఇది ఏం పంటంటే?

Gold that grows on the earth: ఎర్ర చందనానికి సమానంగా విలువ ఉండే పంట మరొకటి ఉంది. దాని పేరు శ్రీ గంధం అంటారు. మన సాధారణ పరిభాషలో గంధం చెట్లు ఇంగ్లీషులో అయితే శాండల్ వుడ్ అని పిలుస్తుంటారు. శ్రీ గంధం చెట్లు ఎలాంటి నేలలో అయినా పెరుగుతుంటాయి. ఇవి 20 నుంచి 40 అడుగుల ఎత్తువరకు పెరుగుతాయి. 12 నుంచి 15 సంవత్సరాల లోపు కోతకు వస్తాయి. వీటి బెరడు మందంగా ఉంటుంది. అంతేకాదు గంధపు చెట్లకు ప్రస్తుతం భారత మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. చాలామంది శ్రీగంధం మొక్కలను నాటుతున్నారు.

Also Read: Madhya Pradesh : భార్యలను లొంగదీసుకోవడానికి..పులి తో “ఆట”.. ఎంతకు తెగించార్రా?

శ్రీ గంధం మొక్కలకు వేలల్లో మాత్రమే ఖర్చు అవుతుంది. ఒక ఎకరంలో శ్రీగంధం మొక్కలు నాటితే.. 15 సంవత్సరాల వరకు వాటిని సంరక్షిస్తూనే ఉండాలి. ఒక్కో చెట్టు నుంచి దాదాపు పది నుంచి పదిహేను కిలోల వరకు గంధం వస్తుంది. ప్రస్తుతం కిలో గంధపు చెక్కకు బహిరంగ మార్కెట్లో 5000 నుంచి 12,000 వరకు పలుకుతోంది. అంటే ఈ లెక్కన ఒక్కో చెట్టుమీద లక్ష వరకు ఆదాయం వస్తుంది. ఒక ఎకరానికి లెక్క వేసుకుంటే మూడు కోట్ల వరకు ఆదాయం లభిస్తుంది. ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రాలు నిర్మించుకునేవారు.. విడిది గృహాలు ఏర్పాటు చేసుకోవాలి అనుకునేవారు శ్రీగంధం మొక్కలను నాటుతున్నారు..

కొంతమంది ఔత్సాహిక రైతులు కూడా శ్రీ గంధం మొక్కలను విరివిగా నాటుతున్నారు.. తద్వారా భారీగా ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.. అయితే శ్రీగంధం మొక్కలను ప్రభుత్వం కనుక రాయితీ మీద ఇస్తే చాలామంది రైతులు సాగు చేయడానికి ముందుకు వస్తారు. ఇప్పటికే కొంతమంది రైతులు శ్రీ గంధం మొక్కలను నాటారు. కొన్ని ప్రాంతాలలో అవి కోతకు కూడా వచ్చాయి. అయితే ముదురు శ్రీ గంధం చెట్లను నరికి వేయడానికి దుండగులు కాచుకొని కూర్చుని ఉంటారు. అలాంటివారి నుంచి కాపాడుకోడానికి కొంతమంది రైతులు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. మొత్తంగా తెలంగాణలో కొన్ని జిల్లాలో శ్రీగంధం మొక్కలు విరివిగా సాగవుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనూ పరిస్థితి అదే విధంగా ఉంది.

Also Read: Rider Inspirational Life Story: రూ.1.25 లక్షల జీత నుంచి ఫుడ్‌ డెలివరీ ఉద్యోగానికి.. ఓ రైడర్‌ జీవన స్ఫూర్తి కథ

శ్రీగంధం మొక్కలు కోతకు వచ్చే సమయం వరకు 40 అడుగుల ఎత్తు పెరుగుతాయి. బెరడు కూడా మందం అవుతుంది. అలాంటి చెట్లను నరకడం వల్ల వాటి నుంచి విలువైన గంధం వస్తుంది. గంధాన్ని సుగంధ ద్రవ్యాలు, ఇతర వస్తువులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇతర ఔషధాలు, సౌందర్య ఉత్పత్తుల తయారీలో గంధపు చెక్కలను ఉపయోగిస్తారు. కర్ణాటక రాష్ట్రంలో గంధం ద్వారా సబ్బులను కూడా ఉత్పత్తి చేస్తున్నారు. అయితే ఈ సబ్బులు అక్కడి ప్రభుత్వ ఆధ్వర్యంలో తయారవుతుండడం విశేషం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular