Gujarat : ఇటీవల మహిళలు, అమ్మాయిల కొట్లాటలు పెరుగుతున్నాయి. ఎనుకటికి నల్లాల వద్ద నీళ్ల కోసం మహిళల మధ్య పంచాయితీలు జరిగేవి. కొన్నినాళ్లుగా అవి కనిపించడం లేదు. కానీ రెండు పిలకలు కలిసి ఉంటాయి కానీ.. రెండు కొప్పులు కలిసి ఉండవు అనే సామెతను నిజం చేయడం లేదని భావిస్తున్నారో ఏమో కానీ చిన్నచిన్న విషయాలకే కొట్లాటకు దిగుతున్నారు.. రోడ్లపైనే పొట్టుపొట్టు తన్నుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే గుజరాత్‌లో చోటుచేసుకుంది. చిన్న విషయానికే ఇద్దరు యువతులు రోడ్డుమీద హంగామా చేశారు. అందరూ చూస్తున్నారనే విషయం మరిచిపోయి ఫైటింగ్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రోడ్డుపైనే తన్నులాట..
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఇద్దరు యువతులు నడిరోడ్డుపై తన్నుకున్నారు. అయితే, ఒకరి వాహనాన్ని మరొకరు ఓవర్ టేక్ విషయంలో వీరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం.. రోడ్డుమీదనే వాళ్లు కొట్లాడుకున్నారు. ఓంటిపై వేసుకున్న బట్టలు చెదిరిపోతున్నాయి.. నలుగురు చూస్తున్నారు అనే విషయం మర్చిపోయారు. పచ్చిగా చెప్పాలంటే తాము అమ్మాయిలం అనే విషయం కూడా ఆ నిమిషంలో మర్చిపోయి మరీ తన్నుకున్నారు.
మధ్యలో వెళ్లి పరువు పోగొట్టుకున్న యువకుడు..
ఇక యువతులు ఫైటింగ్ చేసుకున్నా.. గొడవ పడినా.. కష్టాల్లో ఉన్నా.. యువకుల మనసు కరిగిపోతుంది కదా. తోచిన సాయం చేయడానికి చేతకాని వాడు కూడా ముందుకు వస్తాడు. ఇలాగే యువతుల ఫైటింగ్ మధ్యలో దూరాడో యువకుడు. గొడవ ఆపే ప్రయత్నం చేశాడు. కానీ ఓ యువతి అతడిపై కూడా దాడికి యత్నించింది. ‘నీకెందుకు మధ్యలో వస్తే దవడ పగులుద్ది’ అన్నట్లుగా అతడికి కూడా కొట్టే ప్రయత్నం చేసింది.
చివరకు పోలీసుల ఎంట్రీ..
యువకుడికి పరిగిన పరాభవంతో ఎవరూ గొడవ ఆపేందుకు యత్నించలేదు. ఇంతలో ఈ విషయం పోలీసులకు చేరింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిద్దరీని విడిపించారు. అనంతరం, అక్కడున్న వారిని చెదరగొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనికి నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. రోడ్డుపై ఉమెన్స్ రెజ్లింగ్ అని, అమ్మాయిలకు ఏమైంది.. కొప్పులు కలిసి ఉండవన్న సామెత నిజమే అని కామెంట్స్ పెడుతున్నారు.
રાજકોટના યાગ્નિક રોડ પર બે યુવતીઓ વચ્ચે થઇ છુટ્ટાહાથના મારામારી; વીડિયો થયો વાયરલ #Rajkot #Gujarat #Viral #ViralVideo pic.twitter.com/QcVzmXHAmR
— Zee 24 Kalak (@Zee24Kalak) July 8, 2023