Girl With 50 Children: అతడో స్పెర్మ్ డోనర్. చాలా మందికి తన స్పెర్మ్ దానం చేశాడు. అలా తల్లులయిన వారు చాలా మంది ఉన్నారు. కానీ అతడికి మాత్రం ఇంకా వివాహం కావడం లేదు. దీంతో ఎంతో మందిని అడిగినా తనను పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రావడం లేదు. అసలు భార్యే లేకుండా అతడు కేవలం స్పెర్మ్ దానంతోనే ఇప్పటివరకు దాదాపు నలభై ఏడు మంది పిల్లలు ఉన్నట్లు చెబుతున్నాడు. అతడి పేరు కైల్ గోర్డీ. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్నాడు. తనను రిక్వెస్ట్ చేసిన వారందరికి స్పెర్మ్ దానంగా ఇస్తున్నాడు.

ఇప్పటికి కూడా అతడి ఇన్ స్ట్రా గ్రామ్ ఖాతాకు వందల్లోనే రిక్వెస్ట్ లు వస్తుంటాయి. దీంతో అతడు వారందరికి ఉచితంగా స్పెర్మ్ ఇస్తుంటాడు. వారిలో ఎవరైనా తనను పెళ్లి చేసుకుంటారేమోనని అడిగినా ఎవరు కూడా అతడితో వివాహానికి రెడీ లేమని చెబుతున్నారు.దీంతో అతడి పెళ్లి కూతుళ్ల వేట కొనసాగుతూనే ఉంది. అతడికి ఇప్పటికే ముప్పై ఏళ్లు కావడంతో ఇంకా ఆలస్యం చేయొద్దని భావిస్తున్నా కోరిక మాత్రం తీరడం లేదు.
Also Read: తిరుమల నడక భక్తులపై కీలక నిర్ణయం
స్పెర్మ్ కావాలంటే ఏ కేంద్రంలో అయినా అందుబాటులో ఉంటాయని తెలిసినా తండ్రి ఎవరో తెలుసుకునేందుకే మహిళలు ఎక్కువగా ఇతడిని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అతడు కూడా అడిగిన వారికి దానం చేస్తూ వస్తున్నాడు. బయోలజికల్ ఫాదర్ ఎవరో తెలిసేందుకే అతడి స్పెర్మ్ తీసుకుంటున్నట్లు వారు వెల్లడిస్తున్తున్నారు. కైలే మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా స్మెర్మ్ డొనేట్ చేయడం అతడి సేవాభావానికి నిదర్శనం.
ప్రస్తుతం కైల్ తన పిల్లలను కలుసుకునేందుకు విదేశీ పర్యటనలో ఉన్నాడు. తన వల్ల కలిగిన బిడ్డల్ని కలుసుకునేందుకు దేశాలు తిరుగుతున్నాడు. ఇలాగైనా తనకు ఓ భార్య దొరుకుతుందనే ఆశతో ఉన్నాడు. ఎంతో మంది ఆశలు తీర్చినా అతడి ఆశ మాత్రం తీరడం లేదు. ఓ భర్తను కావాలని అనుకున్నా అతడి కోరిక ఎప్పటికి తీరుతుందో కాలమే నిర్ణయించాలి. ఇప్పటికైనా అతడి ఆశ తీరే మార్గం దొరుకుతందో లేదో తెలియడం లేదు. మొత్తానికి అతడికి కూడా ఓ భార్య దొరకాలని ఆశిద్దాం.
Also Read: సండే స్పెషల్: మాంసానికి బదులు ఇవి తింటే గుండెజబ్బులు రావు