Giant Snake Skeleton: మనం గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తే ఏం చూస్తాం.. హా ఇంకేముంది మనం వెళ్లాల్సిన దారి లేదంటే చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్.. ఇంకా కొంచెం పల్లెటూర్లలో అయితే కొండ ప్రాంతాలు, చెరువులు వగైరా.. వగైరా కనిపిస్తుంటాయి. అయితే మనకు గూగుల్ మ్యాప్‌లో అన్ని కనపడవు. ఆ సమయానికి అక్కడ ఏ ప్రాణి ఉన్నా కూడా అది మనకు మ్యాప్‌లో చూపించదు.

ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా. అయితే ఇప్పుడు సడెన్ గా గూగుల్ మ్యాప్‌లో ఓ 30అడుగుల పొడవైన పాము కనిపించడంతో అందరూ హడలెత్తిపోతున్నారు. ఏంటి పాము కనిపించిందా.. అది కూడా 30అడుగులతోనా.. వామ్మో అని భయపడుతున్నారు కదా.. అవునండి మీరు విన్నది అక్షరాల నిజమే. అయితే అది బతికున్న పాము కాదండోయ్.. చనిపోయిన పాము అస్థిపంజరం.
Also Read: Plastic Surgery Tollywood Actress: సర్జరీలు చేయించుకుని స్టార్ హీరోయిన్లుగా మారిన నటీమణులు వీరే..
వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా.. పాము అస్థిపంజరమే మనకు ఇప్పుడు ఇక్కడ గూగుల్ మ్యాప్ ఫొటోలు కనిపిస్తోంది. ఇప్పుడు నెట్టింట్లో @googlemapsfun పేరుతో ఉన్న TikTok అకౌంట్‌లో ఈ పాముకు సంబంధించిన గుల్ మ్యాప్స్ ఫొటోను షేర్ చేశారు. ఇంకేముంది నెట్టింట్లో కొద్ది గంటల్లోనే వైరల్ గా మారిపోయింది. ఫ్రాన్స్ తీరంలో ఈ భారీ పాము అస్థిపంజరం ఉందని ఈ వీడియో కింద క్యాప్షన్ పెట్టారు.

అయితే పాముకు అసలు ఎముకలు ఉంటాయా.. అంత పెద్ద అస్థిపంజరం మేమెప్పుడూ చూడలేదంటూ మీరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కదా.. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉందండోయ్. నిజానికి ఇది పాము కాదు. ఇదో లే సర్పెంట్ డి ఓషన్ అనే పెద్ద లోహ శిల్పం. ఇది ఫ్రాన్స్ దేశంలోని పశ్చిమ తీరంలో నెలకొని ఉంది. 425 అడుగుల ఎత్తుతో పాటు 30 మీటర్ల పొడవు ఉంటుంది. దీన్ని 2012లో ఎస్తైర్ ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో భాగంగా లే సర్పెంట్ డిఓషన్ ను ఆవిష్కరణ చేశారు. ఈ పెద్ద పాము విగ్రహాన్ని చైనీస్-ఫ్రెంచ్ కళాకారుడు హువాంగ్ యోంగ్ పింగ్ చెక్కారు.
Also Read: Pakistan Prime Minister Imran Khan: ఇమ్రాన్ ఖాన్, సైన్యానికి ఎక్కడ చెడింది..?