https://oktelugu.com/

Nara Lokesh: జ‌నం చెవిలో జ‌గ‌న్ పూలు.. లోకేష్ సెటైరిక‌ల్ ట్వీట్.. మార్పు మొద‌లైందా..?

Nara Lokesh: ఏమో అనుకున్నాం గానీ ఈ మ‌ధ్య లోకేష్ బాగానే మాట‌లు నేర్చేస్తున్నాడండోయ్‌. ఆ మాట మేం చెప్ప‌డం కాదు.. ఆయ‌న చేస్తున్న మాట‌ల‌ను బ‌ట్టి అర్థం అవుతోంది. ఒక‌ప్ప‌టి కంటే లోకేష్ లో చాలా మార్పులే వ‌స్తున్నాయి. అంతిమంగా టీడీపీకి భావి నేత అనిపించుకోవాల‌ని ఆయ‌న ఎప్ప‌టి నుంచో గ‌ట్టిగానే ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆయ‌న సోష‌ల్ మీడియా ద్వారా ఆయ‌న చేస్తున్న కొన్ని సెటైరిక‌ల్ ట్వీట్లు కూడా బాగానే వైర‌ల్ అవుతున్నాయి. ఒక‌ప్పుడు అధికార వైసీపీ […]

Written By:
  • Mallesh
  • , Updated On : April 1, 2022 / 01:09 PM IST
    Follow us on

    Nara Lokesh: ఏమో అనుకున్నాం గానీ ఈ మ‌ధ్య లోకేష్ బాగానే మాట‌లు నేర్చేస్తున్నాడండోయ్‌. ఆ మాట మేం చెప్ప‌డం కాదు.. ఆయ‌న చేస్తున్న మాట‌ల‌ను బ‌ట్టి అర్థం అవుతోంది. ఒక‌ప్ప‌టి కంటే లోకేష్ లో చాలా మార్పులే వ‌స్తున్నాయి. అంతిమంగా టీడీపీకి భావి నేత అనిపించుకోవాల‌ని ఆయ‌న ఎప్ప‌టి నుంచో గ‌ట్టిగానే ప్ర‌య‌త్నిస్తున్నారు.

    Lokesh, Jagan

    ఆయ‌న సోష‌ల్ మీడియా ద్వారా ఆయ‌న చేస్తున్న కొన్ని సెటైరిక‌ల్ ట్వీట్లు కూడా బాగానే వైర‌ల్ అవుతున్నాయి. ఒక‌ప్పుడు అధికార వైసీపీ నేత‌లు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పే స‌రికే లోకేష్ స‌రిపోయేవాడు. కానీ ఇప్పుడు అలా కాకుండా.. తానే ఓ దారి వెతుక్కుని మరీ అడిగే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

    Also Read: Telangana Cabinet Expansion: కేసీఆర్‌ కుటుంబంలో మరో నిరుద్యోగికి ఉద్యోగం!

    ఇందుకు నిద‌ర్శ‌న‌మే ఆయ‌న ఈ రోజు చేసిన ట్వీట్. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. ఈ ట్వీట్ లో ఆయ‌న జ‌గ‌న్‌ను సెటైరిక‌ల్ గా విమ‌ర్శించేశాడు. వైసీపీ ప్రొడ‌క్ష‌న్ స‌మ‌ర్పించి జనం చెవిలో జ‌గ‌న్ పూలు అని ట్వీట్ చేశారు. పైగా దీనికి ఏప్రిల్ 1న విడుద‌ల అంటూ క్యాప్ష‌న్ కూడా ఇచ్చేశారు.

    ఇందులో జ‌గ‌న్ చెప్పిన హామీలు ఒక్క‌టి కూడా అమ‌లు కాలేవంటూ వాటిని ఉటంకిస్తూ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా విద్యుత్ చార్జీలు, మ‌ద్య‌పాన నిషేధం, ప్ర‌త్యేక హొదా, స‌న్న‌బియ్యం పంపిణీ లాంటి విష‌యాల్లో జ‌గ‌న్ హామీ ఇచ్చి మోసం చేశాడంటూ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఎంతైనా గ‌తంలో కంటే లోకేష్ ఇలాంటి సెటైరిక‌ల్ ట్వీట్లు చేయ‌డం కొంత ఆక‌ట్టుకుంటున్నాయ‌నే చెప్పుకోవాలి.

    Nara Lokesh

    వాస్త‌వానికి లోకేష్ చెప్పిన ఈ జ‌గ‌న్ హామీలు చాలా వ‌ర‌కు అమ‌లు కావ‌ట్లేదు. అవ‌న్నీ కూడా గాలి మాట‌లు అయిపోయాయి. వాటిని వెతుక్కొచ్చి మ‌రీ జ‌నాల‌కు అర్థ‌మయ్యే విధంగా లోకేష్ చెప్పే ప్ర‌య‌త్నం అయితే కొంత చేస్తున్నారు. మ‌రి ఆయ‌న చేస్తున్న ఫ‌లితాలు ఆయ‌న్ను ఏ మేర‌కు జ‌నాల్లో నేత‌గా నిల‌బెడుతాయో చూడాలి.

    Also Read: AP New Districts: ప్రభుత్వ పంతం.. కొత్త జిల్లాలకు తుది రూపం

    Tags