Ek Number News On Roja : పవన్ పై ఏడుపు.. ‘రోజా’క్క దడిడ దిబిడే.. జబర్ధస్త్ వాళ్లు వదల్లేదుగా!

Ek Number News On Roja : ఏపీ మంత్రివర్యులు రోజా ఏ ముహూర్తాన మెగా ఫ్యామిలీపై నోరు జారిందో అప్పుడే ఆమెకు మూడింది. మంత్రి కాగానే చిరంజీవి ఇంటికెళ్లి ఆశీర్వాదాలు తీసుకున్న రోజక్క ఇప్పుడు జగన్ తిట్టమంటే తిట్టడాన్ని ఎవరూ జీర్ణించుకోవడం లేదు. ఆమెపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ప్రతిస్పందన వస్తోంది. మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ఆమెను దేవతలా కొలిచే జబర్ధస్త్ కమెడియన్ల నుంచి కూడా రోజా మాట్లాడిన మాటలను తప్పుపట్టడం సంచలనమైంది. […]

Written By: NARESH, Updated On : January 8, 2023 10:55 am
Follow us on

Ek Number News On Roja : ఏపీ మంత్రివర్యులు రోజా ఏ ముహూర్తాన మెగా ఫ్యామిలీపై నోరు జారిందో అప్పుడే ఆమెకు మూడింది. మంత్రి కాగానే చిరంజీవి ఇంటికెళ్లి ఆశీర్వాదాలు తీసుకున్న రోజక్క ఇప్పుడు జగన్ తిట్టమంటే తిట్టడాన్ని ఎవరూ జీర్ణించుకోవడం లేదు. ఆమెపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ప్రతిస్పందన వస్తోంది.

మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ఆమెను దేవతలా కొలిచే జబర్ధస్త్ కమెడియన్ల నుంచి కూడా రోజా మాట్లాడిన మాటలను తప్పుపట్టడం సంచలనమైంది. చిరంజీవి మీద చేసిన ఆరోపణలను జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను సైతం ఖండించారు. ఆయన కొంచెం ఘాటుగానే రోజాకు సమాధానం చెప్పాడు. గెటప్ శ్రీను రోజా ఆరోపణలకు కౌంటర్ గా ఒక సోషల్ మీడియా సందేశం పంచుకున్నారు. అందులో… ‘చిరంజీవిగారి దాన గుణం, సేవా గుణం తెరిచిన పుస్తకం. ఆ విషయంలో ఆయన ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. మీ ఉనికి కోసం ఇలాంటి నిరాదరణ ఆరోపణలు చేయడం సరికాదు. మీ నోటి నుండి ఇంత పచ్చి అబద్దాలు వస్తాయని ఊహించలేదు. మీరు మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి…’ అంటూ గెటప్ శ్రీను రాసుకొచ్చాడు.

గెటప్ శ్రీను సందేశం క్షణాల్లో వైరల్ గా మారింది. ఇక జబర్దస్త్ జడ్జెస్ గా రోజా, నాగబాబు ఏళ్ల తరబడి కలిసి పని చేశారు. అలాగే స్టార్ కమెడియన్ అయిన గెటప్ శ్రీనుతో ఆమెకు మంచి అనుబంధం ఉంది. గెటప్ శ్రీను రోజాను బాగా గౌరవిస్తారు. అయితే అభిమాన నటుడి విషయంలో ఆమె నిరాధార ఆరోపణలు చేయడం… ఆయన్ని హర్ట్ చేసినట్లుంది. అందుకే ఆయన ఫైర్ అయ్యాడు. తెగించి రోజాను ప్రశ్నించాడు.

ఈ క్రమంలోనే రోజా తీరుపై.. వైరల్ , ట్రెండింగ్ వార్తలపై oktelugu.com రూపొందించిన స్పెషల్ సెటైరికల్ ‘ఏక్ నంబర్ న్యూస్’లో మరిన్ని వార్తలు చూడండి.. ఎంజాయ్ చేయండి.. పైన వీడియోను క్లిక్ చేయండి..