Kiara Advani: వచ్చే నెలలో కియారా అద్వానీ వివాహం అని ప్రచారం జరుగుతుండగా ఆమె ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రా చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి. బాలీవుడ్ వర్గాల్లో అతిపెద్ద చర్చకు దారితీశాయి. విషయంలోకి వెళితే… హీరో సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ ప్రేమించుకుంటున్నారంటూ చాలా కాలంగా ప్రచారంలో ఉంది. వీరిద్దరూ కలిసి షేర్షా మూవీలో నటించారు. ఆ మూవీ సెట్స్ లో కియారా-సిద్ధార్థ్ ప్రేమలో పడ్డారట. ప్రస్తుతం రిలేషన్ లో ఉన్నారనేది బాలీవుడ్ వర్గాల వాదన. ఈ క్రమంలో తరచుగా పెళ్లి వార్తలు తెరపైకి వస్తున్నాయి.

2022 డిసెంబర్ లో కియారా వివాహం అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. డిసెంబర్ ముగిసిపోగా…ఫిబ్రవరిలో అని మరో వార్త వెలుగులోకి వచ్చింది. ఈసారి డేట్, వెన్యూ కూడా ప్రకటించారు. ఫిబ్రవరి 6న రాజస్థాన్ లోని జైసల్మేర్ వేదికగా కియారా-సిద్ధార్థ్ పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయి. జైసల్మేర్ వెళ్లిన ప్రత్యేక సిబ్బంది కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు మూడు రోజులు మెహందీ, సంగీత్ కార్యక్రమాలతో ఘనంగా వివాహం జరగనుందంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఈ వార్తల నేపథ్యంలో త్వరలో కియారా పెళ్లి అని జనాలు మైండ్స్ లో ఫిక్స్ అయ్యారు. అనూహ్యంగా హీరో సిద్ధార్థ్ బాంబు పేల్చాడు. ఇప్పటికే రెండు సార్లు నా పెళ్లి అన్నారు. అయితే నన్నెవరూ పిలవలేదు. నా వ్యక్తిగత విషయాలపై కాకుండా సినిమాలపై దృష్టి పెడితే మంచిది… అని పరోక్షంగా కియారాతో పెళ్లి వార్తలను ఖండించారు. ఈ క్రమంలో మీడియాతో పాటు బాలీవుడ్ జనాలు ఒక్కసారిగా షాక్ తిన్నారు. అంతా కుదిరింది పెళ్లే తరువాయి అనుకుంటున్న తరుణంలో సిద్ధార్థ్ వ్యాఖ్యలు అనేక అనుమానాలకు కారణమయ్యాయి.

పెళ్లి చేసుకుందాం అనుకుని కూడా వీరు క్యాన్సిల్ చేసుకున్నారా? కియారాకు సిద్ధార్థ్ బ్రేకప్ చెప్పారా?.. అనే సందేహాలు, ఊహాగానాలు మొదలయ్యాయి. కాగా ఎప్పటి నుండో సన్నిహితంగా ఉంటున్న కియారా-సిద్ధార్థ్ ప్రేమించుకుంటున్నట్లు వెల్లడించింది లేదు. కాగా సిద్ధార్థ్ లేటెస్ట్ మూవీ మిషన్ మజ్ను జనవరి 20న నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఇందులో రష్మిక మందాన హీరోయిన్. ఇక కియారా హీరో రామ్ చరణ్ కి జంటగా ఆర్సీ 15 చేస్తుంది. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది.