https://oktelugu.com/

Gaytri Bhargavi: ఐ డ్రీమ్ థంబ్ నైల్ పరాకాష్ట.. ఇచ్చి పడేసిన గాయత్రి భార్గవి..

Gaytri Bhargavi ఒక విషయాన్ని జనాల్లోకి ఎక్కువగా తీసుకుపోవాలంటే దాని గురించి ప్రచారం చేయాలి. అంతేతప్ప పెడపోకడలు పోకూడదు. అడ్డదారులు తొక్కకూడదు.

Written By: , Updated On : March 24, 2025 / 02:28 PM IST
Gaytri Bhargavi

Gaytri Bhargavi

Follow us on

Gaytri Bhargavi: నేటి కాలంలో ముఖ్యంగా యూట్యూబ్ జర్నలిజంలో ఒక విషయాన్ని బయట ప్రపంచానికి బలంగా చెప్పడానికి అడ్డదారులు తగ్గడం ఎక్కువైపోయింది. తప్పుడు పద్ధతులను అవలంబించడం పెరిగిపోయింది. తిక్క తిక్క థంబ్ నైల్స్ పెట్టి.. ఇష్టానుసారంగా వ్యాఖ్యానాలు చేసి యూట్యూబ్లో పోస్ట్ చేయడం పరిపాటిగా మారిపోయింది. అందువల్లే డిజిటల్ జర్నలిజం అంటే గాలి మాటల వ్యవహారంగా రూపాంతరం చెందింది. అయితే ఇది ఎక్కడికి దారి తీస్తుంది.. ఎక్కడి దాకా వెళ్తుంది.. అనే ప్రశ్నలకు జవాబులు లేవు. కాకపోతే డిజిటల్ నిజం ఇంకా ఇంకా అంధపాతాళానికి వెళ్తుందనేది నూటికి నూరుపాళ్లు నిజం. యూట్యూబ్లో వ్యూస్ కోసం.. యూట్యూబ్ వాడు ఇచ్చే డాలర్ల కోసం అడ్డదారులు తొక్కుతున్న యూట్యూబ్ ఛానల్స్ ఎన్నో ఉన్నాయి. ఇష్టానుసారంగా మాట్లాడితే థంబ్ నైల్స్ పెడుతూ పిచ్చి పిచ్చి ప్రచారం చేసే చానల్స్ పెరిగిపోయాయి. అందువల్లే యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఎలాంటి దారుణాలు చూడాల్సి వస్తుందోనని చాలామంది భయపడుతున్నారు.

Also Read: పిచ్చెక్కి పిచ్చకొట్టుడు కొట్టాలి.. అదే SRH ప్లాన్.. వైరల్ వీడియో!

ఐ డ్రీమ్ కు ఇచ్చి పడేసింది

తెలుగు చిత్రపరిశ్రమలో గాయత్రి భార్గవి అనే క్యారెక్టర్ ఆర్టిస్టు ఉన్నారు. ఆమె ప్రఖ్యాత చిత్రకారులు, దర్శకులు బాపు – రమణకు దగ్గరి బంధువు అవుతారు. ప్రముఖ దర్శకుడు ముళ్లపూడి వర ఆమెకు మామ వరస అవుతారు. గాయత్రి భార్గవి తెలుగు స్పష్టంగా మాట్లాడుతారు. పలు చిత్రాల్లో నటించారు. ఇక వ్యాఖ్యాతగా కూడా ఆమె వ్యవహరించారు. అలాంటి ఆమెను ఇటీవల ఐ డ్రీమ్ సంస్థ ఇంటర్వ్యూ చేసింది. గాయత్రి భార్గవి భర్త ఆర్మీలో పనిచేస్తారు. ఆయన పేరు విక్రం. ఐ డ్రీమ్ లో పనిచేస్తున్న ప్రఖ్యాత జర్నలిస్టు స్వప్న కోరిక మేరకు గాయత్రి భార్గవి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్మీ కుటుంబం పడే కష్టాలను ఆమె వెల్లడించారు. తన భర్తతో పాటు పనిచేసే ఓ వ్యక్తి సరిహద్దులో చనిపోయారు. ఆ సమయంలో ఆ కుటుంబం పడిన ఆవేదనను గాయత్రి భార్గవి చెప్పారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. గాయత్రి భార్గవి చెప్పిన విషయాన్ని ఐ డ్రీమ్ మీడియా మరో విధంగా పబ్లిష్ చేసింది. దానికి ఇంకో విధంగా థంబ్ నైల్ పెట్టింది. గాయత్రి భార్గవి కుటుంబంలో విషాదం జరిగినట్టు.. ఆ బాధను ఆమె అనుభవిస్తున్నట్టు.. ఆ థంబ్ నైల్ లో చెప్పే ప్రయత్నం చేసింది. ఇది గాయత్రి భార్గవి దృష్టికి రావడంతో ఒక్కసారిగా ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. తన సెల్ఫీ వీడియో ద్వారా పడుతున్న ఆవేదనను వెల్లడించింది. ఇదే సమయంలో ఆమె భర్త విక్రమ్ కూడా ఆర్మీకి గౌరవం ఇవ్వండి అంటూ సవినయంగా కోరుకోవడం విశేషం. గాయత్రి భార్గవి దెబ్బకు ఐ డ్రీమ్ మీడియా లెంపలు వేసుకుంది. తప్పు జరిగిపోయిందని క్షమాపణ చెప్పింది.. ఇలాంటివి ఇంకోసారి జరగమని హామీ ఇచ్చింది. ఐ డ్రీమ్ సంస్థ స్పందించిన తీరు బాగానే ఉంది. కానీ ఇలా తప్పులు చేస్తూ.. జనాల్లోకి వెళ్తున్నాయని.. వ్యూస్ బాగా వస్తున్నాయని అడ్డదారులు తొక్కే యూట్యూబ్ చానల్స్ చాలా ఉన్నాయి. మరి అటువంటి వాటిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదా? యూట్యూబ్ మేనేజ్మెంట్ దా? ఎందుకంటే ఇలాంటి విషానికి ఎక్కడ ఒకచోట ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఎన్నో అనర్ధాలు జరుగుతాయి.