వీర్రాజు తో అంత వీజీ కాదని అర్థం చేసుకున్న ఏబిఎన్ ఆర్కే…!

రాధాకృష్ణ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండిగా మనకు తెలుసు. అయితే రాజకీయపరంగా అతను తెలుగుదేశం పార్టీ అనఫీషియల్ నేత అన్నది విషయం మాత్రం ఎవరూ బయటకు చెప్పలేని నిజం. ఇదే సమయంలో తన శక్తి మేరకు తెలుగుదేశం పార్టీని రక్షించేందుకు ఏబీఎన్ ఆర్కే పాటుపడుతూ ఉంటారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకొని జగన్ ను ఓడించడం వెనుక 2019 ఎన్నికల్లో బాబు ఏకాకిగా అయిపోయి ఘోర పరాజయాన్ని మూట […]

Written By: Kusuma Aggunna, Updated On : August 22, 2020 6:51 pm
Follow us on

రాధాకృష్ణ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండిగా మనకు తెలుసు. అయితే రాజకీయపరంగా అతను తెలుగుదేశం పార్టీ అనఫీషియల్ నేత అన్నది విషయం మాత్రం ఎవరూ బయటకు చెప్పలేని నిజం. ఇదే సమయంలో తన శక్తి మేరకు తెలుగుదేశం పార్టీని రక్షించేందుకు ఏబీఎన్ ఆర్కే పాటుపడుతూ ఉంటారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకొని జగన్ ను ఓడించడం వెనుక 2019 ఎన్నికల్లో బాబు ఏకాకిగా అయిపోయి ఘోర పరాజయాన్ని మూట కట్టుకోవడం వెనుక ఆర్కే హస్తం ఎంతైనా ఉందని అది విశ్లేషకుల మాట.

ఈ మధ్య ఆర్కే పైన బాబు ఆధారపడడం తగ్గించినా కూడా ఎంతో విశ్వాసంగా రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కి సాయం చేయాలని అక్కడ అవకాశాలు లేకపోయినా… సృష్టించుకుని మరీ తన సంపాదకీయాల ద్వారా వారికి తన రాతలతో సహకారం అందిస్తూ ఉంటాడు. ఇదే ఈ క్రమంలో అతను రాసిన ఎన్నో విశ్లేషణలు, వ్యాసాలు, సంపాదకీయాలు మరి వన్ సైడ్ గా ఉంటాయి. ఇప్పుడు సోము వీర్రాజుకి కూడా అతను రాసిన ఒక సంపాదకీయం చిర్రెత్తుకొచ్చేలా చేసింది. అంతే…. మిగతా వారిలా లోపల తిట్టుకోకుండా.. మీడియా ముందు వచ్చి ఇండైరెక్ట్ గా విమర్శలు చేయకుండా నేరుగా ఆర్కే కే లేఖ రాసేశారు.

మా పార్టీ అంతర్గత విషయాలు నిర్లజ్జగా వేలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీసిన సోము వీర్రాజు…. మీరు టిడిపి కి మడుగులు వత్తాలి అనుకుంటే అది మీ ఇష్టం కానీ అలా అని అతి ప్రేమను, లేని ప్రేమను బీజేపీపై ఒలికించ్చాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. తమ రాష్ట్ర ప్రజలందరికీ మీ గుట్టు తెలుసునని… కేంద్ర ప్రభుత్వానికి మీ సంపాదకీయం సరిగ్గా అర్ధం కాకపోతే అర్ధం అయ్యేలా తాను చెబుతాను అని అన్నారు. మీరు మీ సంపాదకీయంలో జీవీఎల్ నరసింహారావు గురించి ప్రస్తావించారు కాబట్టి నేను కూడా బహిరంగంగానే ఏపీ బీజేపీ తరఫున రిప్లై ఇలా లేఖ ద్వారా ఇచ్చాని అని తేల్చి చెప్పారు.

ఇప్పటివరకు ఏపీ బిజెపి అంటే పెద్దగా లెక్క చేయని రాష్ట్ర ప్రజలంతా ఒక్కసారిగా సోము వీర్రాజు దెబ్బకు తల తిప్పి ఇటు వైపు చూశారు. ఇక పచ్చ తమ్ముళ్లు అయితే వణికిపోయారు. ఏబిఎన్ ఆర్కే.. సోము వీర్రాజుని ఇంత తక్కువగా తప్పుడు అంచనా వేశానా అని మదనపడుతూ ఉంటాడు.