Virat Kohli, Gautam Gambhir : ఒకప్పటి క్రికెటర్లు.. ఇప్పుడు ప్రత్యర్థులుగా మైదానంలో తలపడేసరికి క్రీడారంగంలో అదో వైరల్ అయ్యింది. విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ ల మధ్య జరిగిన ఈ గొడవలో తప్పు ఎవరిదో స్పష్టంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇద్దరూ తమ తమ వెర్షన్ లు చెప్పుకున్నారు. ఇక అప్ఘన్ క్రికెటర్ నవీన్ ను విరాట్ ఆవేశంతో తన కాలి బూటు చూపించి మరీ తిట్టేశాడు. ఈ ఘటనలోనూ కొందరు కోహ్లీ ఫ్యాన్స్ నవీన్ ను తిడుతున్నారు.మరికొంతమంది కోహ్లీని విమర్శిస్తున్నారు.
ఐపీఎల్ ఒక్కసారిగా వేడెక్కింది. మ్యాచ్ మధ్యలో వర్షం వచ్చి వాతావరణం అంతా చల్లగా మారినా.. ఆటగాళ్ల మధ్య గొడవలతో అగ్గిరాజేసుకుంది. సోమవారం ఆర్సీబీ-లోక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆటగాళ్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అంతకుముందు లక్నో గెలవగా.. ఇటీవల ఆర్సీబీ గెలిచి ప్రతీకారం తీర్చుకుంది.
ఈ మ్యాచ్ సమయంలోనే కోహ్లీ -గంభీర్ మధ్య.. ఆ తర్వాత కోహ్లీ -నవీన్ మధ్యన మాటల తూటాలు పేలాయి.ఈ గొడవకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోల్లో కొందరు ఒకరిదే తప్పు అని అంటున్నారు. మరొకరిది తప్పు కాదని అంటున్నారు.
ఈ క్రమంలోనే అసలు మైదానంలో ఏం జరిగింది? ఎవరు ఎవరితో మాట్లాడారు? ఎవరు కవ్వించారు? ఎవరు కాలుదువ్వారన్న దానిపై పూర్తి వీడియో బయటకు వచ్చింది. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూసిన ఓ క్రికెట్ అభిమాని దీన్ని తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో మొదటి నుంచి చివరి వరకూ ఒక్క కట్ లేకుండా గంభీర్, కోహ్లీ మధ్య వాగ్వాదం వరకూ సాగింది. దీంతో ఈ వీడియో చూసిన అభిమానులు గంభీర్ ది తప్పు అని కొందరు.. కోహ్లీ దే తప్పు అని మరికొందరు తిట్టిపోస్తున్నారు.
