https://oktelugu.com/

AP Financial State : ఒకటో నెలే రూ.10 వేల కోట్లు హంఫట్..ఏపీ సర్కారు దుబారా

ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. అప్పుపుట్టనిదే పూట గడవదు అన్న చందంగా మారింది. ఆర్థిక క్రమశిక్షణ కట్టుదాటుతోంది.

Written By:
  • Dharma
  • , Updated On : May 5, 2023 / 01:16 PM IST
    Follow us on

    AP Financial State : ఆదాయం మూరెడు.. వ్యయం బారెడు అన్నట్టుంది ఏపీ సర్కారు వ్యవహార శైలి. ఆదాయం కొసరంత అయితే.. ఖర్చు కొండంత కనిపిస్తోంది.పైగా చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు లేవు. చిన్నచిన్న పనులకు సైతం చెల్లించడం లేదు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదు. మూడో వారం దాటుతున్నా చెల్లింపులు లేవు. కానీ ప్రభుత్వ అస్మదీయ వర్గంగా ఉన్న వలంటీర్లకు, సలహాదారులకు మాత్రం ఠంచనుగా ‘గౌరవమైన’ భృతిని అందిస్తున్నారు. అటు సాక్షికి ఫుల్ పేజీ యాడ్లతో, అనుకూల మీడియాకు స్థాయికి తగ్గట్టు ప్రకటనలతో సంతృప్తి పరుస్తున్నారు. ప్రభుత్వ ధనాన్ని పంచిపెడుతున్నారు.

    ఆర్థిక క్రమశిక్షణేదీ?
    ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. అప్పుపుట్టనిదే పూట గడవదు అన్న చందంగా మారింది. ఆర్థిక క్రమశిక్షణ కట్టుదాటుతోంది.  ఈ ఆర్థిక సంవత్సరం ఎంత గొప్పగా నడిపించబోతోందో మొదటి నేల క్లారిటీ వచ్చేసింది. తొలి నెలలో ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా పన్నెండు వేల కోట్ల లోటు కనిపించింది. ఇంటే ఇంత పెద్ద మొత్తంలో అప్పులు లేకపోతే.. చెల్లింపుల నిలిపివేతతో నెట్టుకొచ్చింది. ఏప్రిల్‌లో కేవలం రూ.8,147 కోట్లు ఆదాయం రాగా, వ్యయం మాత్రం ఏకంగా రూ.20,320 కోట్లు రికార్డు అయినట్లు తేలింది. దీంతో రూ.12,173 కోట్లు లోటుగా ఉన్నట్లు తేలింది.

    అప్పుల పరంపర
    పోనీ అప్పు చేయలేదంటే అదీ లేదు. రుణం కోసం ఆర్బీఐను ఆశ్రయించారు. ఏప్రిల్‌లో సెక్యూరిటీ వేలం ద్వారా ఆరువేల కోట్లను రుణంగా తీసుకున్నారు. అయినప్పటికీ ఇంత లోటు ఉండటం అసాధారణం అని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. మే మొదటి వారం దాటుతున్నా..ఏప్రిల్ నెలకు సంబంధించి ఇంకా 60 శాతం మందికి జీతాలు రాలేదు. పెన్షన్లు అందించలేదు. ఉద్యోగవర్గాల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వ చర్యలు అలవాటుపడిన వారు మాత్రం ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.30 వేల కోట్లు అప్పు తీసుకోవడానికి కేంద్రం పర్మిషన్ ఇచ్చింది. ఇప్పటికే రూ.6 వేల కోట్లు తీసుకున్నారు. మరో నాలుగు కోట్లు తీసుకుంటే కానీ జీతాల చెల్లింపులుండవు. అంటే ఈ ఒక్క నెలలో రూ.10 వేల కోట్లు పూర్తిచేశారు. మరి మిగతా 12 నెలల గురించే ఇప్పుడు ప్రశ్నంతా..

    ఏడాదంతా కష్టమే..
    ఎన్నికల చివరి ఏడాది. పథకాలు అమలుచేయాల్సి ఉంది. అటు ప్రభుత్వ భవనాల నిర్మాణానికి బిల్లులు చెల్లించాలి. అయితే ప్రభుత్వం వద్ద ఏ నెలకు ఆ నెలే అన్నట్టు పరిస్థితి ఉంది.  అసలు జీతాలకే తంటాలు పడాల్సి వస్తోంది. చేస్తున్న అప్పులకు తిరిగి చెల్లింపులు కూడా భారంగా మారుతున్నాయి. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం అత్యధికం… కానీ అది అప్పుల చెల్లింపులకు తరిగిపోయేటంతగా ఉంది. కానీ వైసీపీ సర్కారు ఇవేమీ పట్టించుకోవడం లేదు. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు మాత్రమే జగన్ ఉవ్విళ్లూరుతున్నారు. అందుకే ఏపీ ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలో నెట్టేస్తున్నారన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు.