Funny Wedding Gift: Funny Wedding Gift: వివాహాల్లో నవ్వుల పువ్వులు పూయించడం పరిపాటే. అయితే కొందరు కొన్ని విచిత్రమైన పద్ధతుల్లో వియ్యాల వారిని ఆటపట్టిస్తుంటారు. ఇంకొందరు వధూవరులను కూడా తమదైన శైలిలో ఆడుకుంటారు. వారితో ఏవో పనులు చేయిస్తూ అందరు పగలబడి నవ్వుకునేలా చేస్తుంటారు. వివాహమంటేనే సందడి. చాలా మంది సరదాలు చేస్తుంటారు. స్నేహితులు, బంధువులు అందరు వధూవరులను ఆటపట్టస్తుంటారు. ఏవో ప్యాకెట్లు తీసుకొచ్చి విప్పిస్తుంటారు. చివరకు అందులో ఏదో ఒక వింత వస్తువు పెట్టి సరదాగా హాస్యం పండిస్తుంటారు.

పెళ్లంటేనే సరదాల పంట. అందరు వేడుక చూడాలని భావిస్తారు. వధూవరులకు ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి వారిని ఆటపట్టించడం మామూలే. అయితే కొందరు ఇచ్చే బహుమతులు ప్రత్యేకంగా ఉంటాయనడంలో సందేహం లేదు. పరిస్థితులకు అనుగుణంగా గిఫ్ట్ లు తీసుకురావడం తెలిసిందే. ఈ క్రమంలో స్నేహితులు తమ వారి ఆనందానికి ఏదో ఒక తంతు చేస్తుంటారు. వారిని బురిడీ కొట్టించేందుకు తాపత్రయపడుతుంటారు. అందులో భాగంగానే ప్రత్యేకతలున్న బహుమతి తీసుకొచ్చి ఆట పట్టించారు.
Also Read: Bigg Boss Telugu OTT: అషురెడ్డిని నలిపేసిన యాంకర్ శివ.. అక్కడ చెయ్యి వేసి దారుణం..
కొంత మంది నిరోధులు, మరికొంత మంది ఉల్లి, ఇంకొంతమంది పెట్రో ల్ వంటి వస్తువులు పెట్టి నవ్విస్తుంటారు. ఇవి సరదాగా వైరల్ అవుతుంటాయి. బహుమతుల కోసం వధూవరులు గంటల తరబడి ప్యాకింగ్ ను తీసేస్తూ అలసిపోతుంటారు. ఇదే సందర్భంలో అందరు నవ్వుకుంటూ వారిని ఇట్లే బక్రాలను చేస్తుంటారు. ఈ సందర్భంలో బంధుమిత్రుల్లో ఆనందం వెల్లివిరుస్తుంటుంది.

తాజాగా శ్రీకాకుళం జిల్లా సోంపేట పట్టణంలోని ఓ వివాహ వేడుకలో ఓ గమ్మత్తైన విషయం జరిగింది. ఓ పెళ్లి వేడుకలో జరిగిన తంతు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంద. స్నేహితుల వివాహానికి హాజరై వారు ఓ బహుమతి వధూవరులకు ఇచ్చారు. దీంతో వారు ఆతృతగా ప్యాకెట్ విప్పడంతో ఖంగుతిన్నారు. అందరు పగలబడి నవ్వుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరెంటు కోతలు పెరుగుతున్న నేపథ్యంలో వారికి మిత్రులు ఇచ్చిన గిఫ్ట్ ఆశ్చర్యం కలిగిందింది. అందులో ఏముందంటే కరెండు పోయినప్పుడు విసురుకునేందుకు విననకర్ర ఇవ్వడంతో అందరిలో హాస్యం పండింది.
Also Read:
4 Day Work Week: నాలుగు రోజుల పనికే ఉద్యోగుల మొగ్గు..?
[…] […]