Sanjay Kumar: కోర్టు భవనంపై స్టెనో గ్రాఫర్ తో లాయర్ పాడు పని.. వైరల్ వీడియో

గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదిగా సంజీవ్ కుమార్ పనిచేసేవారు. అయితే ఆయన తెలంగాణ హైకోర్టు ఆవరణలోని పై భాగంలో అదే కోర్టులో పనిచేస్తున్న స్టెనో గ్రాఫర్ ను తీసుకెళ్లారు.

Written By: Suresh, Updated On : February 13, 2024 12:09 pm
Follow us on

Sanjay Kumar: సమాజంలో అన్యాయం జరిగితే.. బాధితుల పక్షాన నిలిచి.. వారికి న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత అతడిది. కానీ ఆ బాధ్యతను అతడు పక్కన పెట్టినట్టున్నాడు. నల్లకోటు వేసుకున్నాననే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా పాడు పని చేశాడు. అది కూడా న్యాయ దేవత కొలువై ఉండే కోర్టులో.. ఎవరికి తెలియకుండా అతడు చేసిన పని.. ఇంకెవరో వీడియో తీసి.. సభ్య సమాజం దృష్టికి తీసుకురావడంతో ఒక్కసారిగా అతడి రాసలీల వ్యవహారం బయటికి వచ్చింది. ఫలితంగా సదరు న్యాయమూర్తి వ్యవహారం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదిగా సంజీవ్ కుమార్ పనిచేసేవారు. అయితే ఆయన తెలంగాణ హైకోర్టు ఆవరణలోని పై భాగంలో అదే కోర్టులో పనిచేస్తున్న స్టెనో గ్రాఫర్ ను తీసుకెళ్లారు. అక్కడ ఇద్దరు ఏకాంతంగా కూర్చుని చాలాసేపు మాట్లాడుకున్నారు. ఉన్నట్టుండి సంజీవ్ కుమార్ పైకి లేచారు. కాస్త అటు ఇటు తిరిగి..ఎవరూ లేరు అని నిర్ధారించుకొని ఒక్కసారిగా స్టెనో గ్రాఫర్ ను ముద్దు పెట్టుకున్నారు. ఆ తర్వాత బయటకు వచ్చారు. వారిద్దరూ ఏకాంతంగా ఉన్న వీడియోను ఎవరో మూడో వ్యక్తి గుట్టు చప్పుడు కాకుండా వీడియో తీశారు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది తెగ సర్కులేట్ అవుతోంది.

సంజీవ్ కుమార్ గత భారత రాష్ట్ర సమితి హయాంలో గవర్నమెంట్ స్పెషల్ జిపిగా పనిచేశారు. వివిధ కేసులకు సంబంధించి ప్రభుత్వం తరఫున ఆయన వాదించారు. అయితే ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి అధికారం కోల్పోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ఆయన తన పదవి కోల్పోయారు. ప్రస్తుతం మాజీ స్పెషల్ జిపిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో అదే కోర్టులో స్టెనోగ్రాఫర్ గా పనిచేస్తున్న యువతిని కోర్టు ఆవరణలోని పైభాగం లోకి తీసుకువెళ్లారు. అక్కడ ఆమెను ముద్దు పెట్టుకున్నారు. అయితే ఈ సంఘటన ఐదు నెలల క్రితం జరగగా.. ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇక ఈ వీడియో కంటపడటంతో న్యాయవాదులు ఫిర్యాదు చేయడంతో ఆయనను జడ్జి ప్యానెల్ నుంచి తొలగించారు.. కోర్టు ఆవరణలో ఇలాంటి పనులకు పాల్పడినందుకుగానూ ఆ స్టెనో గ్రాఫర్ ను విధుల నుంచి సస్పెండ్ చేశారు.. కాగా ఇప్పుడు ఐదు నెలల క్రితం జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియోను ఇప్పుడు పోస్ట్ చేయడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కోర్టు ఆవరణలో ఇలాంటి ఘటనకు పాల్పడడం సరికాదని.. ఇలాంటి ఘటన వల్ల న్యాయమూర్తులపై తప్పుడు సంకేతాలు వెళ్తాయని న్యాయవాదులు అంటున్నారు.

సంజీవ్ కుమార్ వ్యవహరించిన తీరు పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయానికి ఆలవాలమైన కోర్టు ఆవరణలో ఇలాంటి పనులకు పాల్పడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వారిద్దరి మధ్య వ్యక్తిగత సంబంధాలు ఉంటే బయట చూసుకోవాలని.. కోర్టు ఆవరణ పై భాగంలో ఇలాంటి పనులకు పాల్పడితే తప్పుడు సంకేతాలు వెళ్తాయని వారికి తెలియదా అని? ప్రశ్నిస్తున్నారు.. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతోంది.